Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

కేటీఆర్ కారుపై చెప్పు విసిరే య‌త్నం… రైతు సంఘం నేత అరెస్ట్‌!

కేటీఆర్ కారుపై చెప్పు విసిరే య‌త్నం… రైతు సంఘం నేత అరెస్ట్‌!

  • క‌రీంన‌గ‌ర్ జిల్లా మెట్‌ప‌ల్లిలో ఘ‌ట‌న‌
  • కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయ‌త్నం
  • కారుపై చెప్పు విసిరివేసేందుకు య‌త్నం
  • అడ్డుకుని అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు శుక్ర‌వారం అనూహ్య ఘ‌ట‌న ఎదురైంది. రైతు సంఘం నేత నుంచి ఆయ‌న‌కు నిర‌స‌న ఎదురైంది. కేటీఆర్ కారుపై ఏకంగా చెప్పు విసిరేందుకు రైతు సంఘం నేత య‌త్నించారు. అయితే అప్ర‌మ‌త్తంగా ఉన్న పోలీసులు…కేటీఆర్ కారుకు చాలా దూరంలోనే రైతు సంఘం నేత‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దృశ్యాలు మీడియాలో వైర‌ల్‌గా మారిపోయాయి.

ప‌లు అధికారిక కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకునే నిమిత్తం శుక్ర‌వారం క‌రీంన‌గ‌ర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కేటీఆర్ జిల్లాలోని మెట్‌ప‌ల్లికి కూడా వెళ్లారు. అయితే కేటీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో రైతు సంఘం నేత‌ల నుంచి నిర‌స‌నలు వ్య‌క్త‌మ‌వుతాయ‌న్న స‌మాచారంతో పోలీసులు రైతు సంఘం నేత‌ల‌ను ముంద‌స్తుగానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. వారిలో నారాయ‌ణ రెడ్డి అనే రైతు సంఘం నేత కూడా పోలీస్ స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లోనే ఉన్నారు.

సాయంత్రం వేళ మెట్‌ప‌ల్లి చేరుకున్న కేటీఆర్ కాన్వాయ్ రైతు సంఘం నేత‌లు ఉన్న పోలీస్ స్టేష‌న్ ముందు నుంచే వెళుతోంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన నారాయ‌ణ రెడ్డి… ప‌రుగు ప‌రుగున పోలీస్ స్టేష‌న్ గేటు వ‌ద్ద‌కు చేరుకుని కేటీఆర్ కారుపై చెప్పు విసిరేందుకు య‌త్నించాడు. అయితే పోలీస్ స్టేష‌న్ ఆవ‌ర‌ణ పెద్ద‌దిగా ఉండ‌టంతో నారాయ‌ణ రెడ్డి గేటు చేరుకోక‌ముందే పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. నారాయ‌ణ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

Related posts

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్ష పదవికి ఫరూక్ అబ్దుల్లా రాజీనామా!

Drukpadam

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వచ్చేది 23 సీట్లే: విష్ణుకుమార్ రాజు

Ram Narayana

బీజేపీలో కానీ, ఆర్ఎస్ఎస్‌లో కానీ చేరితే పది రోజుల్లోనే బెయిలు వస్తుందన్నారు: అఖిల్ గొగొయ్ సంచలన ఆరోపణ!

Drukpadam

Leave a Comment