Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పోలీసుల వలయాన్ని ఛేదించుకుని జేబీఎస్ కు వెళ్లిన సంజయ్!

పోలీసుల వలయాన్ని ఛేదించుకుని జేబీఎస్ కు వెళ్లిన సంజయ్!

బస్టాండ్ అంతా కలియతిరిగిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు
ప్రయాణికుల ఇబ్బందులు తెలుసుకున్న సంజయ్
చార్జీలు ఎవరి కోసం పెంచారంటూ బీజేపీ ఫైర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ ,సికింద్రాబాద్ లోని జేబీఎస్ బస్సు స్టాండ్ సందర్శనకు అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఆయన ఇంటినుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు గృహనిర్బందాన్ని ఛేదించుకొని ఆటోలో బస్సు స్టాండ్లో ప్రత్యక్షమవడం పోలీస్ యంత్రాగాన్ని ఆశ్చర్యపరిచింది. బీజేపీ శ్రేణులు ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు . రాష్ట్రప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను నిరసించారు . కేంద్రం ఒకపక్క ఆయిల్ రేట్లు తగ్గించినప్పటికీ రాష్ట్రప్రభుత్వం ఆర్టీసీ టికెట్ రేట్లను పెంచడంపై మండి పడుతున్నారు . చార్జీలు పెంచిన విధంగా ప్రయాణికులకు సౌకర్యాలు కూడా కల్పించడంలేదని విమర్శిస్తున్నారు. వెంటనే పెంచిన చార్జీలు తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు .

రాష్ట్రంలో మరోసారి ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ బీజేపీ నిరసనలకు పిలుపు నించింది. అందులో భాగంగా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ సికింద్రాబాద్ జేబీఎస్ లో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆ వలయాన్ని ఛేదించుకుని వారి కళ్ళు కప్పి మరీ ఆయన జేబీఎస్ కు ఆటోలో చేరుకోవడంతో పోలీసులు కంగు తిన్నారు . బస్సు స్టాండ్ కు చేరుకున్న సంజయ్ అక్కడ ప్రయాణికులతో మాట్లాడారు . బస్సు చార్జీల పెంపుపై వారి అభిప్రాయాలూ తెలుసుకున్నారు . అక్కడ సౌకర్యాలపై కూడా ఆరా తీశారు . ఆయన వచ్చిన విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు సైతం అక్కడకు చేరుకొని ఆయన వెంట నడిచారు .

బస్టాండ్ లో కలియతిరుగుతూ ప్రయాణికుల ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ సర్కారు ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రయాణికులపై పెనుభారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, చార్జీలు పెంచిన మేర సౌకర్యాలు కల్పించడం లేదని బీజేపీ రాష్ట్ర శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. బస్సులు కండిషన్ లో లేవని, వాటి నిర్వహణ కూడా సరిగ్గా ఉండదని పేర్కొంది. బస్టాండ్లలో కనీస వసతులు లేవని, శుభ్రత కరవని ఆక్షేపించింది. మరి, ఎవరి బాగు కోసం చార్జీలను పెంచుతున్నారని ప్రశ్నించింది.

Related posts

జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. చేసేదేమీ లేదు: కవిత

Drukpadam

ఈటల వల్ల బీజేపీకి ప్లస్ అవుతుందా ?

Drukpadam

మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం.. 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పై నిలిచిపోయిన ప్రధాని..

Drukpadam

Leave a Comment