Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. జగన్‌ను ఇంటికి పంపండి: ఎంపీ సుజనా చౌదరి!

ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. జగన్‌ను ఇంటికి పంపండి: ఎంపీ సుజనా చౌదరి

  • కడవకొల్లు ఎంపీయూపీ పాఠశాలలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన సుజనా చౌదరి
  • రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరిన బీజేపీ నేత
  • వడ్డే శోభనాద్రీశ్వరరావు అభినందనీయుడన్న రాజేంద్రప్రసాద్

రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఓటుతో ఇంటికి పంపాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సుజనా చౌదరి అన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలోని కడవకొల్లు ఎంపీయూపీ పాఠశాల ప్రాంగణంలో రూ. 7 లక్షల ఎంపీ నిధులతో అభివృద్ధి చేసిన వడ్డే శ్రీరాములు క్రీడా ప్రాంగణాన్ని నిన్న ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపాలని ప్రజలను కోరారు. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటర్లు తమ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని, ఆ లక్ష్యంతోనే ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కమ్యూనిటీ హాలుతోపాటు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి గ్రామస్థులు, విద్యార్థులకు తనవంతు సాయం చేసిన వడ్డే అభినందనీయుడని మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు నేతృత్వంలో వివిధ బీసీ సంఘాల నాయకులు నిన్న విజయవాడలోని వెన్యూ కల్యాణ మండలంలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన సుజనా చౌదరి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీసీ సామాజిక సంఘాలన్నీ ఐక్యంగా ఉంటేనే హక్కుల సాధన సులభమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో సమావేశమై తమ సమస్యలు చెప్పుకునేందుకు సుజనా చౌదరి సంధానకర్తగా నిలవాలని కోరారు.

Related posts

ఎక్కడ బంగారు తెలంగాణ …ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు…

Drukpadam

టీడీపీ అధినేత చంద్రబాబుపై బిక్కవోలు పీఎస్ లో కేసు నమోదు!

Drukpadam

శరద్ పవార్ ను రాష్ట్రపతి రేసులో నిలిపేందుకు రంగంలోకి దీదీ!

Drukpadam

Leave a Comment