ఖమ్మం టీఆర్ యస్ లో ఐక్యత రాగం …

ఖమ్మం టీఆర్ యస్ లో ఐక్యత రాగం …
-పార్టీ కార్యాలయంలో తాజా మాజీలతో కేటీఆర్ భేటీ
-హాజరైన తుమ్మల ,పొంగులేటి , నామ , అజయ్ ,
-వనమా , రేగా , కందాల, రాములు నాయక్ , మెచ్చా
-విదేశీ టూర్ లో ఉన్న జిల్లా అధ్యక్షుడు ,ఎమ్మెల్సీ తాతా మధు
-వివాహార యాత్రలో సండ్ర
-అందరు కలిసి పనిచేయాలని హితవు
-గెలుపు గుర్రాల‌కే టికెట్లన్న మంత్రి
-సిట్టింగులంద‌రికీ సీట్లు అనుకోవ‌డం స‌రికాదని వ్యాఖ్య‌
-పార్టీకి సీనియ‌ర్ల అవ‌స‌రం ఉందని వెల్ల‌డి
-ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా సిద్ధంగా ఉండాల‌న్న కేటీఆర్‌
-అందరిని కో-ఆర్డినేట్ చేసే భాద్యత మంత్రి అజయ్ కి అప్పగింత
-మళ్ళీ కలుద్దామని ఉపదేశం
-అందరికి అవకాశాలు కల్పిస్తామని హామీ

జిల్లాలో పార్టీ అభివృద్దే లక్ష్యంగా అందరు కల్సి పనిచేయాలని మంత్రి పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లాలోని పార్టీ నాయకులూ ఉద్బోధ చేశారు . నేడు ఖమ్మం లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన కేటీఆర్ ఖమ్మం జిల్లా టీఆర్ యస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ఐక్యత రాగం ఆలపించారు . అందరు నాయకులూ కలిసి పనిచేయాలని హితవు పలికారు . ఇది ఒక ముందడుగు అని తాజా మాజీలతో భేటీ కావడం నాయకుల మధ్య ఉన్న బేదాభిప్రాయాలు తొలగి ఐక్యతకు దోహదపడుతుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ సమావేశానికి చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా అంటి ముట్టనట్లుగా ఉంటున్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరు కావడం విశేషం … ఇంకొక విచిత్రమైన విశేషమేమంటే అందరిని కో ఆర్డినేట్ చేసే భాద్యతను జిల్లా మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ మీద కేటీఆర్ పెట్టారు . సమావేశంలో వీరితో పాటు శాసన సభ్యులు వనం వెంకటేశ్వరరావు , రేగా కాంతారావు , మెచ్చా నాగేశ్వరరావు , కందాల ఉపేందర్ రెడ్డి , లావుడ్య రాములు నాయక్ లు పాల్గొన్నారు . ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా టీఆర్ యస్ అధ్యక్షుడు తాతా మధు విదేశీ పర్యటనలో ఉండగా , సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కుటుంబసభ్యులతో కలిసి విహార యాత్రలో ఉన్నట్లు సంచరం … అయితే ఈ సమావేశం ఇది ఒక ముందడుగు అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నా… వీరి మధ్య ఐక్యత సాధ్యమౌతున్నదా? అనే అభిప్రాయాలూ కూడా ఉన్నాయి.

 

కేటీఆర్ ఖమ్మం రాక సందర్బంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో లంచ్ ఏర్పాటు చేశారు . అసమ్మతినాయకుడిగా ఉన్నప్పటికీ కేటీఆర్ తో మంచి స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్న శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారతాడనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయన అనేక సార్లు తాను పార్టీ మారడంలేదని చెప్పినప్పటికీ ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడలేదు . ఇప్పుడు కేటీఆర్ తో పాటు జిల్లా మంత్రి అజయ్ , ఎంపీ నామ నాగేశ్వర్ రావు , ఇతర ఎమ్మెల్యేలు పొంగులేటి ఇంటికి వచ్చారు …

తుమ్మ‌ల‌, పొంగులేటిల‌ను పార్టీ వ‌దులుకోదు: కేటీఆర్‌

2023 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ శ‌నివారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీనియ‌ర్ నేత‌ల‌ను పార్టీ వ‌దులుకోద‌ని చెప్పిన కేటీఆర్‌… పార్టీకి సీనియ‌ర్ల అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డిల‌ను పార్టీ వ‌దులుకోద‌ని కూడా కేటీఆర్ చెప్పారు.  ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రాల‌కే టికెట్లు ఇస్తామ‌ని చెప్పారు. సిట్టింగులంద‌రికీ సీట్లు వ‌స్తాయ‌ని అనుకోవ‌డం స‌రికాద‌ని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు.

 

కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు కాగానే జిల్లాలో ఉన్న పరిస్థితులపై కేటీఆర్ కు వివరించిన ఎంపీ నామ నాగేశ్వరరావు అందరితో కలిపి జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చినట్లు సమాచారం . అందుకు అనుగుణంగా జిల్లాలోని తాజా మాజీలను అందరిని ఈ సమావేశానికి మంత్రి స్వయంగా పిలిచినట్లు తెలుస్తుంది. మరి పొంగులేటి ,తుమ్మల లను ఎక్కడ ఎలా అకామిడేట్ చేస్తారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది . మళ్ళీ కలుద్దామని పార్టీ అభివృద్ధికి అందరు కలిసి పనిచేయాలని హితవు పలికారు . అందరికి అవకాశాలు కల్పిస్తామని చెప్పినట్లు తెలుస్తుంది….చూద్దాం ఏమో జరుగుతుందో

Leave a Reply

%d bloggers like this: