రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం దీదీ ప్రయత్నాలు!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం దీదీ ప్రయత్నాలు!
-తృణ‌మూల్ భేటీకి దీదీ ఆహ్వానితుల జాబితా వెల్లడి
-8మంది సీఎంల‌కు దీదీ ఆహ్వానం
-కాంగ్రెస్ అధినేత్రి సోనియాకూ అందిన ఆహ్వానం
-ఆప్ నుంచి కేజ్రీవాల్‌, భ‌గ‌వంత్‌ల‌కు దీదీ పిలుపు
-ఏపీ నుంచి ఒక్క పార్టీకి అంద‌ని ఆహ్వానం

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో విపక్షాల త‌ర‌ఫున ఉమ్మ‌డి అభ్య‌ర్థిని నిలిపే క్ర‌మంలో చ‌ర్య‌ల‌ను వేగవంతం చేసిన తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఈ నెల 15న ఢిల్లీలో దేశంలోని ప‌లు రాజ‌కీయ పార్టీల‌కు చెందిన జాతీయ స్థాయి నేత‌ల‌తో ప్ర‌త్యేక స‌మావేశాన్ని ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశానికి రావాలంటూ శ‌నివారం దీదీ స్వ‌యంగా కేసీఆర్‌కు ఫోన్ చేశారు.

తాజాగా ఈ భేటీకి దీదీ నుంచి ఆహ్వనం అందిన వారు వీరేనంటూ కొంద‌రి పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఈ వార్త‌ల మేర‌కు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా దీదీ ఆహ్వానం పంపారు. ఇక ఈ జాబితాలో ఢిల్లీ, పంజాబ్ సీఎంలుగా కొన‌సాగుతున్న ఆప్ నేత‌లు అర‌వింద్ కేజ్రీవాల్‌, భ‌గ‌వంత్ మాన్‌, కేర‌ళ సీఎం పిన‌రయి విజ‌య‌న్‌, ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే, త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ త‌దిత‌రులున్నారు.

ఇదిలా ఉంటే… అటు రాజ్య‌స‌భ‌తో పాటు ఇటు లోక్ స‌భ‌లో, ఏపీ అసెంబ్లీలో మంచి సంఖ్యా బ‌లం ఉన్న వైసీపీకి గానీ, ఏపీలో విప‌క్ష పార్టీ టీడీపీకి గానీ దీదీ నుంచి ఎలాంటి ఆహ్వానం అంద‌లేద‌ని స‌మాచారం. అదే స‌మ‌యంలో క్ర‌మంగా దేశ‌వ్యాప్తంగా విస్త‌రిస్తున్న ఎంఐం పార్టీకి కూడా దీదీ నుంచి ఇప్ప‌టిదాకా ఆహ్వాన‌మే అంద‌లేదు. ఇక విప‌క్ష కూట‌మిలో కీల‌క నేత‌గా ఉన్న ఎన్సీపీ అదినేత శ‌ర‌ద్ ప‌వార్‌కు కూడా దీదీ ఆహ్వానం అంద‌న‌ట్లుగా తెలుస్తోంది. అయితే భేటీకి మ‌రింత స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో వీరికి కూడా దీదీ నుంచి ఆహ్వానం అందే అవ‌కాశాలున్నాయంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

Leave a Reply

%d bloggers like this: