కులంతోపనిలేదు …ఈ లక్షణాలు ఉంటె చాలు యువతి పెళ్లి ప్రకటన!

కులంతో పనిలేదు.. ఈ లక్షణాలు ఉంటే సంప్రదించండి!

  • పత్రికల్లో ప్రకటన ఇచ్చిన హజారీబాగ్ యువతి
  • అబద్ధాలు ఆడనివాడు, పిసినిగొట్టు కాకుండా ఉంటే చాలన్న యువతి
  • కులంతో పనిలేదని స్పష్టీకరణ

తనకు ఎలాంటి వరుడు కావాలో చెబుతూ ఓ యువతి ఇచ్చిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కులంతో తనకు సంబంధం లేదని, ఈ లక్షణాలు ఉన్నవారు తనను నేరుగా సంప్రందించవచ్చంటూ పత్రికల్లో ప్రకటన ఇవ్వడమే కాకుండా ఓ పెళ్లి వేడుకలో గోడలపైనా అతికించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌‌లోని జెండా చౌక్ సమీపంలో నివసించే బంగాలీ దుర్గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే, తనకు తగ్గ వరుడిని తానే వెతుక్కోవాలని నిర్ణయించుకుంది.

ఇందులో భాగంగా పత్రికలో ప్రకటన కూడా ఇచ్చింది. ఆపై ఓ పెళ్లి వేడుకలో గోడలపైనా ఆ ప్రకటన అంటించింది. దీంతో ఆ వేడుకకు హాజరైన వారి దృష్టి దానిపై పడింది. ఆ ప్రకటనలో తనకు ఎలాంటి అబ్బాయి కావాలో చక్కగా వివరించింది. అబద్ధాలు చెప్పే అలవాటు లేనివాడు, పిసినిగొట్టులా వ్యవహరించనివాడు ఏ కులానికి చెందిన వాడైనా తనను సంప్రదించవచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే కాస్తంత చురుగ్గా ఉంటే సరిపోతుందని, తనకంటే చిన్నవాడైనా పర్వాలేదని పేర్కొంది. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు తనను సంప్రదించవచ్చంటూ రెండు ఫోన్ నంబర్లు కూడా ఇచ్చింది. ఇప్పుడీ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె పేర్కొన్న లక్షణాలు మీలో ఉన్నాయనుకుంటే, దూరం ఎక్కువైనా పర్వాలేదనుకుంటే మీరు కూడా సంప్రదించొచ్చు.

Leave a Reply

%d bloggers like this: