Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గ్రామం యూనిట్ గా ప్రజాసమస్యలపై ఉదృతం పోరాటాలు …తమ్మినేని

గ్రామం యూనిట్ గా ప్రజాసమస్యలపై ఉదృతం పోరాటాలు …తమ్మినేని
-కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న కేంద్రం …
-ప్రజాసమస్యలు పట్టని రాష్ట్రం
-సంక్షేమాన్ని గాలికి వదిలిన కేసీఆర్ ..రాష్ట్రాన్ని అప్పల రాష్ట్రంగా మార్చారు
-కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం నిర్వహించాలి
.-ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలు

గ్రామం యూనిట్ గా ప్రజాసమస్యలపై ఉదృతంగా పోరాటాలు నిర్వహించాలని సిపిఎం నిర్ణయించిందని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు .ఆదివారం ఖమ్మం సుందరయ్య భవన్ లో జరిగిన ఖమ్మం నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు . కేంద్రం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుండగా , రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ ప్రజాసమస్యలను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు . రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు …మహిళలపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతున్నా చర్యలు శూన్యం అని దుయ్యబట్టారు . రాష్ట్రాన్ని అప్పలమయం చేసిన కేసీఆర్ ఆ విషయాన్నీ పక్కదారి పట్టించేందుకు కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు .

ప్రధాని నరేంద్ర మోడీ కేవలం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు పరితపిస్తున్నారు అని తెలిపారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు తారా స్థాయికి చేరాయని వాటిని అదుపు చేయడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు . రాష్ట్రంలో రోజు రోజు కు మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు . మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు ఉండటం ఏమిటని ప్రశ్నించారు. అప్పుల రాష్ట్రంగా మార్చి జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి కి ప్రభుత్వం నెట్టివేయబడిందనన్నారు. సంక్షేమ పథకాలు హామీల తప్ప అమలుకు నోచుకోవడంలేదని గుర్తు చేశారు . రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలు నిర్వహించాలని కార్యకర్తలందరూ గ్రామం యూనిట్ గా పోరాటాలుకు ప్లాన్ చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో ఉదృతమేన పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

లిక్కర్ స్కాం సూత్రధారి ,పాత్రధారి కవితే …ఆమె అరెస్ట్ ఖాయం …బీజేపీ నేత ప్రభాకర్ …

Drukpadam

నిన్న, మొన్న వచ్చినవారికి మంత్రి పదవులు…ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

Drukpadam

తెలుగు రాష్ట్రాల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తున్న కేంద్ర సర్కార్…

Drukpadam

Leave a Comment