Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీ ఈడీ విచారణపై దేశవ్యాపితంగా కాంగ్రెస్ నిరసనలు …

రాహుల్ గాంధీ ఈడీ విచారణపై దేశవ్యాపితంగా కాంగ్రెస్ నిరసనలు …
-లంచ్ బ్రేక్ ఇచ్చిన ఈడీ …తిరిగి సాయంత్రం విచారణ
-ఇంటిలో భోజ‌నం, ఆసుప‌త్రిలో త‌ల్లికి ప‌రామ‌ర్శ‌… తిరిగి ఈడీ ఆఫీస్‌కు రాహుల్
-మధ్యాహ్న భోజ‌నం కోసం ఇంటికి రాహుల్ గాంధీ
-భోజ‌నం త‌ర్వాత ఆసుప‌త్రిలో త‌ల్లికి ప‌రామ‌ర్శ‌
-ఆపై తిరిగి ఈడీ కార్యాల‌యానికి చేరుకున్న నేత‌
-మ‌లి విడ‌త విచార‌ణ‌ను ప్రారంభించిన ఈడీ అధికారులు

నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల వ్యవహారంలో మనీలాండరింగ్ కు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత ,ఎంపీ రాహుల్ గాంధీ నేడు ఈడీ విచారణకు హాజరైన సందర్భంగా దేశవ్యాపితంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. దేశరాజధాని ఢిల్లీలో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ కు చెందిన రాజస్థాన్ , ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రులు అశోక్ గేహలేట్ ,దభేల్ లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె సి వేణుగోపాల్,మల్లిఖార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు . వీరిని పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం విడుదల చేశారు . కాగా ఇప్పటివరకు ఈడీ విచారణకు హాజరైన ఎక్కరిని ఇంటికి లంచ్ చేసేందుకు అనుమతించని అధికారులు రాహుల్ గాంధీకి అనుమతి ఇచ్చారు .

నేష‌న‌ల్ హెరాల్డ్ ఆస్తుల వ్య‌వ‌హారంలో మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ‌కు హాజ‌రైన కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీకి విచార‌ణ‌లో భాగంగా భోజ‌న విరామం దొరికిన సంగ‌తి తెలిసిందే. సోమ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు ఈడీ కార్యాల‌యానికి రాహుల్ రాగా ఆయ‌న‌ను ఈడీ అధికారులు 3 గంట‌ల పాటు విచారించారు. ఆ త‌ర్వాత మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల స‌మ‌యంలో మ‌ధ్యాహ్న భోజ‌నం చేసేందుకు రాహుల్ గాంధీ త‌న ఇంటికి వెళ్లేందుకు ఈడీ అధికారులు అనుమ‌తించారు.

ఈ క్ర‌మంలో ఈడీ కార్యాల‌యం నుంచి నేరుగా త‌న ఇంటికి వెళ్లిన రాహుల్ గాంధీ మ‌ధ్యాహ్న భోజ‌నం ముగించారు. ఆ తర్వాత స‌ర్ గంగారామ్ ఆసుప‌త్రిలో చికిత్స‌ పొందుతున్న త‌న త‌ల్లి సోనియా గాంధీని ప‌రామ‌ర్శించారు. త‌ద‌నంత‌రం అక్కడి నుంచి ఆయ‌న నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇలా మ‌ధ్యాహ్నం ఓ గంట పాటు విచార‌ణ నుంచి విరామం తీసుకుని తిరిగి త‌మ కార్యాల‌యానికి వ‌చ్చిన రాహుల్‌ను ఈడీ అధికారులు తిరిగి విచారిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఈడీ విచార‌ణ‌కు పిలిచిన వైనంపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ దేశ‌వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. రాహుల్ గాంధీని ఈడీ అధికారులు ఎంతసేపు విచారిస్తారో, అంత‌సేపు ఈడీ కార్యాల‌యాల ముందు శాంతియుతంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ పార్టీ తీర్మానించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఆ పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌ల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు స‌మీపంలోని పోలీస్ స్టేష‌న్ల‌కు వారిని త‌ర‌లించారు. ఆ త‌ర్వాత వారిని విడుద‌ల చేశారు.

ఇలా ఈడీ కార్యాల‌యాల ముందు నిర‌స‌న‌కు దిగిన నేత‌ల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్ద‌రు సీఎంలు అశోక్ గెహ్లాట్ (రాజ‌స్థాన్‌), భూపేష్ బాఘెల్ (ఛ‌త్తీస్‌గ‌ఢ్), రాజ్య‌స‌భ‌లో విప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే, పార్టీ సీనియ‌ర్లు కేసీ వేణుగోపాల్ స‌హా మ‌రికొంద‌రు నేత‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ అరెస్ట్ సంద‌ర్భంగా ఆయ‌న‌ను ఈడ్చుకుంటూ వెళ్లిన పోలీసుల వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. శాంతియుత నిర‌స‌న‌కు దిగినా… ఇలా దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తారా? అంటూ పోలీసుల‌పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

రాహుల్ గాంధీ అంటే ఏమిటో చెప్పిన ప్రియాంకా గాంధీ!

నేష‌న‌ల్ హెరాల్డ్ ఆస్తుల వ్య‌వ‌హారంలో మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌ల‌పై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీల‌పై కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో విచార‌ణ‌కు రావాలంటూ ఇప్ప‌టికే సోనియా స‌హా రాహుల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) నోటీసులు జారీ చేయగా…సోమ‌వారం ఉద‌యం రాహుల్ గాంధీ ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

ఈ సందర్భంగా సోద‌రుడి వెంట ప్రియాంకా గాంధీ పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేర‌గా…పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేత‌ల‌ను ఆ పార్టీ కార్యాల‌యానికే త‌ర‌లించిన పోలీసులు… రాహుల్ గాంధీని మాత్రం పోలీసు వాహ‌నంలోనే ఈడీ కార్యాల‌యానికి త‌ర‌లించారు.

ఈ సంద‌ర్భంగా ఈడీ అధికారులు, పోలీసుల తీరుపై ప్రియాంకా గాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా త‌న సోద‌రుడు రాహుల్ గాంధీ అంటే ఏమిట‌న్న విష‌యాన్ని కూడా ఆమె ఆస‌క్తిక‌రంగా చెప్పారు. దేనికీ త‌లొగ్గ‌ని స‌త్యాన్నే రాహుల్ గాంధీ అంటారంటూ ఆమె వ్యాఖ్యానించారు. పోలీసు బారికేడ్లు, ఈడీ బెదిరింపులు, లాఠీలు, నీటి ఫిరంగులు… ఇలా దేనికీ రాహుల్ గాంధీ త‌లొగ్గ‌ర‌ని ఆమె చెప్పారు.

హైద్రాబాద్ లోని ఈడీ కార్యాలయం ముందు పీసీసీ ఆధ్వరంలో నిరసన చేపట్టారు . కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు . పోలీసులు వీరిని అడ్డుకున్నారు . అయినప్పటికీ ఎవరు ఈడీ కార్యాలయానికి చేరుకొని నీరసం తెలిపారు .ఈ సందర్భంగా నాయకులూ మాట్లాడుతూ కోర్ట్ , ఎన్నికల సంఘం ఈ కేసును పక్కకు పెట్టిన కావాలనే రాజకీయ కక్షతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని వేధించేందుకే ఎలా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు .

Related posts

రెండు మూడు నెలల్లో సంచలన వార్తను చెపుతాను: కేసీఆర్

Drukpadam

కర్ణాటక కాంగ్రెస్ లో కలకలం రేపుతున్న ఎమ్మెల్యేల లేఖ.. అది ఫేక్ అన్న డీకే శివకుమార్

Ram Narayana

రాష్ట్ర రాజకీయాల్లో పొత్తుల ఎత్తులు …ఖమ్మం లెక్కలు!

Drukpadam

Leave a Comment