Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్ర‌స్తుతం ఈ స్థాయిలో ఉన్నానంటే అది వైఎస్సార్ వల్లే: కొండా సురేఖ

ప్ర‌స్తుతం ఈ స్థాయిలో ఉన్నానంటే అది వైఎస్సార్ వల్లే: కొండా సురేఖ
-కొండా చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో కొండా సురేఖ‌
-విజ‌య‌వాడ‌లో వైఎస్సార్ విగ్ర‌హానికి నివాళి
-వైఎస్ మ‌ర‌ణించాక ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను క‌ల‌వ‌లేద‌న్న సురేఖ‌

ఉమ్మ‌డి రాష్ట్రానికి సీఎంగా ప‌నిచేసిన దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిపై కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో మాత్ర‌మే త‌న‌కు అనుబంధం ఉంద‌ని, ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను తాను ఎప్పుడూ క‌ల‌వ‌లేద‌ని ఆమె చెప్పారు. త‌న భ‌ర్త కొండా ముర‌ళి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన కొండా చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సోమ‌వారం విజ‌య‌వాడకు వచ్చిన సురేఖ… న‌గ‌రంలోని వైఎస్సార్ విగ్ర‌హానికి నివాళి అర్పించారు. అనంత‌రం అక్క‌డే ఆమె మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడారు.

ప్ర‌స్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అది వైఎస్సార్ వ‌ల్ల‌నేన‌ని కొండా సురేఖ అన్నారు. వైఎస్ ఆశ‌యాల‌కు అనుగుణంగానే రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నాన‌ని ఆమె చెప్పారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఎలాంటి విలువ‌లు లేవ‌ని, డ‌బ్బే ప్ర‌ధానంగా రాజ‌కీయాలు మారిపోయాయ‌న్నారు. ఏ పార్టీ అయినా ప్ర‌జ‌ల అభివృద్ధి, సంక్షేమం కోస‌మే ప‌నిచేయాల‌ని ఆమె అన్నారు. ఏపీలో ఇప్పుడు వేరే ప్ర‌భుత్వం ఉంద‌ని ఆమె వ్యాఖ్యానించారు. త‌న కుటుంబం పార్టీలోనే ఉంద‌ని ఆమె చెప్పారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి పై తన అభిమానాన్ని చాటుకున్న కొండా సురేఖ ఆయన మరణం తరవాత వారి కుటుంబసభ్యులను కలవలేదని చెప్పటడం ఆశ్చర్యానికి గురిచేసిందనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు . ఆమె వైయస్ కాంగ్రెస్ లో చేరి జగన్ వెంట నడిచారు .వారి కుటుంబంతో సన్నిహితంగా ఉన్నారు . పరకాల ఉపఎన్నికలో సైతం వైయస్ఆర్ కాంగ్రెస్ తరుపున ఆమె పోటీచేశారు . తరువాత జగన్ తో విభేదాలు వచ్చాయి. నాటి నుంచి ఆమె వారి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు . ఆమె కావాలనే ఆలా చెప్పారా ? లేక మర్చిపోయారా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

బీజేపీ ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై దాడిని ఖండించిన అమిత్ షా!

Drukpadam

ఈయన పెద్ద దానకర్ణుడిలా మాట్లాడుతున్నాడు: సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

Ram Narayana

రాజశేఖరరెడ్డి నరరూప రాక్షసుడు.. జగన్ ఊసరవెల్లి: టీఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు…

Drukpadam

Leave a Comment