తొలి రోజే రాష్ట్రప‌తి ఎన్నిక‌కు 11 నామినేష‌న్లు… ఒక నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌!

తొలి రోజే రాష్ట్రప‌తి ఎన్నిక‌కు 11 నామినేష‌న్లు… ఒక నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌

  • రాష్ట్రప‌తి ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌
  • బుధ‌వారం నుంచే నామినేష‌న్ల దాఖ‌లుకు అవ‌కాశం
  • తొలి రోజే దాఖ‌లైన 11 నామినేష‌న్లు
  • ఓ నామినేష‌న్‌ను తిర‌స్క‌రించిన రిట‌ర్నింగ్ అధికారి

భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైన బుధ‌వార‌మే ఏకంగా ఆ ఎన్నిక‌కు 11 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. జూలై 23తో ప్ర‌స్తుత రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. ఈ లోగా కొత్త రాష్ట్రప‌తిని ఎన్నుకోవాల్సి ఉన్న నేప‌థ్యంలో రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు బుధ‌వారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రప‌తి ఎన్నిక‌కు 11 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు పార్ల‌మెంటు స‌హా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ పోలింగ్ నిర్వ‌హిస్తున్నా… నామినేష‌న్ల దాఖలు మాత్రం పార్ల‌మెంటులోని లోక్ స‌భ సెక్ర‌టేరియ‌ట్‌లోనే కొన‌సాగుతుంది. అంతేకాకుండా ఈ ఎన్నిక‌ల్లో పాలుపంచుకునే వారిలో 50 మంది ప్ర‌తిపాదిస్తే త‌ప్పించి నామినేష‌న్లు వేయ‌డం కుద‌ర‌దు. అయినా కూడా బుధ‌వారం తొలి రోజే రాష్ట్రప‌తి ఎన్నిక‌కు 11 నామినేష‌న్లు దాఖ‌లు కాగా…వాటిలో ఓ నామినేష‌న్‌ను రిట‌ర్నింగ్ అధికారి తిర‌స్క‌రించారు. ఈ నామినేషన్లు దాఖలు చేసిన వారి వివరాలు తెలియరాలేదు.

Leave a Reply

%d bloggers like this: