Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం లో మంత్రి అజయ్ పై ధ్వజమెత్తిన షర్మిల!

ఖమ్మం లో మంత్రి అజయ్ పై ధ్వజమెత్తిన షర్మిల!
ఆయన రౌడీ ,గుండా అంటూ విమర్శలు
కబ్జాలకు కేర్ ఆఫ్ గా అజయ్ అంటూ ఆరోపణలు
ఖమ్మం లో నియంత పాలనా సాగుతుందన్న షర్మిల
హోదా, హుందాతనం తెలియని మంత్రి అని చురకలు

 

గత 96 రోజులుగా తెలంగాణాలో పాదయాత్ర నిర్వహిస్తూ నేడు ఖమ్మం వచ్చిన వైయస్సార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాత బస్సు స్టాండ్ వద్ద జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ మంత్రి అజయ్ ,ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు . కేసీఆర్ విధానాలను దుయ్యబట్టిన షర్మిల , ఆయనది కుటుంబపాలన అంటూ విమర్శలు గుప్పించారు . కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించారని ద్వజమెత్తారు . కేసీఆర్ పరిపాలన ఫామ్ హౌస్ లో తోంగొనేటట్లు ఉంది . తెలంగాణ లో కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదు ఇచ్చిన హామీలన్నీ మోసమే పూరితమేనని అన్నారు . ఉద్యోగాలు అని మోసం.. నిరుద్యోగ భృతి అని మోసం…రుణమాఫీ అని మోసం.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని మోసాలే కళ్ళముందు రెండు లక్షల ఉద్యోగాలు కనిపిస్తున్నా…కేసీఆర్ కు కనిపించవు దున్నపోతు మీద వానపడినట్లు కేసీఆర్ మీద చలనం లేదు చందమామలు లాంటి పిల్లలు చనిపోతుంటే ఎందుకు స్పందించడం లేదు
కేసీఆర్ కు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదుని విమర్శలు చేశారు . ఉద్యమం లో నేను నా ముసలి దానికి పావుసెరు బియ్యం చాలు అన్నారు. ఉద్యమం తప్పా వేరే ధ్యాస లేదు అన్నారు . ఇప్పుడు కొడుకు,కూతురు,అల్లుడు అందరూ పదవుల్లో రాజాబోగం అనుభవిస్తున్నారు .కేసీఆర్ ఇంట్లో అన్ని ఉద్యోగాలు ఉంటే ..ప్రజలు మాత్రం అడుక్కొని తినాలా..? త్యాగాలు ఎవరివి…భోగాలు ఎవరివి..?అని ప్రశ్నించారు .

డిగ్రీలు పీజీ లు చదివించి కూలి పనులు చేసుకోవడానికి నా..? ఉద్యమం లో గ్రూప్ 1 పరీక్షలు రాయొద్ధని చెప్పిన కేసీఆర్… తెలంగాణ లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు 8 ఏళ్లుగా నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు మా పోరాటం తోనే ప్రభుత్వం లో చలనం వచ్చిందని అన్నారు .
కేసీఆర్ బాత్ రూం లో బుల్లెట్ ప్రూఫ్ గోడలు ఉండాలి. ప్రజలు మాత్రం ఇల్లు లేకుండా ఉండాలి .కేసీఆర్ ఛాతీలో ఉన్నది గుండె కాదు…బండ అంటూ మండిపడ్డారు .

మంత్రి అజయ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు . రౌడీ ,గుండా మంత్రి , కబ్జా కోరు , ధనదాహం ఉందని ,అన్ని కాంట్రాక్టులు ఆయనకే కావాలని ,హైద్రాబాద్ లో 80 ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపణలు గుప్పించారు .మంత్రి పదవి వచ్చినప్పటికీ దాని హుందాతనం గాని హోదా గాని తెలియదని విమర్శించారు . అభివృద్ధి చేశానని చెబుతున్న మంత్రి చేసింది ఏమిటని నిలదీశారు . నాలుగు రోడ్లు ,వీధిలైట్లు , విగ్రహాలు , డివైడర్లు పెట్టి నిర్మాణం అంటే సరిపోతుందా అని ప్రశ్నించారు . ప్రజల బ్రతుకుల్లో మార్పులేని అభివృద్ధి అభివృద్ధి ఎలా అవుతుందో చెప్పాలని అన్నారు .

ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్ లా ఉండాలని అన్నారు . ఒకే సారి రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్ దేనని పేర్కొన్నారు . ఉచిత విద్యుత్ పై మొదటి సంతకం పెట్టారు వైఎస్సార్ కదా అని అన్నారు . ప్రపంచం లో ఏ నాయకుడు ఆలోచన చేయని పథకాలు వైఎస్సార్ అమలు చేసి చూపించారు కొనియాడారు . ఒక్క రూపాయి పెంచకుండా 5 ఏళ్లు పరిపాలన చేశారని గుర్తి చేశారు

పాదయాత్రలో ఆటో నడిపిన షర్మిల

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 96వ రోజుకు చేరుకుంది. ఈరోజు సాయంత్రం ఖమ్మం పాత బస్టాండ్ దగ్గర జరిగే భారీ బహిరంగ సభతో ఈ నాటి పాదయాత్ర ముగుస్తుంది. మరోవైపు ఈనాటి పాదయాత్రలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. షర్మిల ఆటోను నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డ్రైవరన్నల కష్టానికి ఫలితం దక్కే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు. కర్షకులతో పాటు కార్మికుల సంక్షేమానికి కూడా సమ ప్రాధాన్యతను ఇవ్వడమే వైఎస్సార్టీపీ ధ్యేయమని అన్నారు.

Related posts

ఆజాద్ అండ్ టీం ప్రచారం చేస్తానంటుంది…

Drukpadam

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై మండిప‌డ్డ రేవంత్ రెడ్డి!

Drukpadam

ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య త్వరలో కొత్త పార్టీ!

Drukpadam

Leave a Comment