Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి ,లేదా కేటీఆర్ బాసరకు రావాల్సిందే …బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు!

ముఖ్యమంత్రి ,లేదా కేటీఆర్ బాసరకు రావాల్సిందే …బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు!
-సమస్యలు పరిష్కరించారం కావాలంటే వారు స్వయంగా రావాలి
-బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరించాలని మూడురోజులుగా విద్యార్థులు ఆందోళన
-వెంటనే డైరెక్టర్ ని నియమించిన ప్రభుత్వం …
-బోధన సిబ్బందిని నియమించాలని విద్యార్థులు డిమాండ్
-12 డిమాండ్స్ ను ప్రభుత్వం ముందుంచిన విద్యార్థులు 6 డిమాండ్లకు ప్రభుత్వం ఒకే
-బాసర ట్రిపుల్ ఐటీకి వెళుతున్న బండి సంజయ్ అరెస్ట్​

తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మూడు రోజులుగా నిరసన చేపట్టారు. దాదాపు ఆరువేల మంది విద్యార్థులు క్యాంపస్ లో బైఠాయించారు. గురువారం వర్షంలోనూ తమ నిరసనను కొనసాగించారు. ట్రిపుల్ ఐటీకి ఉప కులపతిని నియమించడంతో పాటు బోధన సిబ్బందిని తక్షణమే నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాకలిటీ లేకపోవడం, రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేకపోవడం , విద్యార్థులకు లాప్ టాప్ లు ఇవ్వకపోవడం ,యూనిఫామ్ ఇవ్వకపోవడం , మెస్ నిర్వహణ క్యాంటిన్ నిర్వహణ సరిగా లేకపోవడం , దుప్పట్లు , మంచాలు పాడైపోయిన మార్చకపోవడం , లాంటి సమస్యలతో విద్యార్థులు సతమౌతున్నారు . ఈ విషయాలను జిల్లా కలెక్టర్ తోపాటు విసి కి , అక్కడ ఉన్న మంత్రికి , ప్రజాప్రతినిధులకు విన్నవించారు . కానీ సమస్యలు మాత్రం పరిస్కారం కావడంలేదు . రోజులు గడుతున్న ట్రిపుల్ ఐటీ గురించి ఎవరు పట్టించుకున్న పాపాన పోవడంలేదు .చేసేది లేక ఆందోళన బాటపట్టాల్సి వచ్చింది. ప్రభుత్వం తమ ఆందోళన గురించి పట్టించుకోకుండా పోలీసులతో అణిచి వెలయాలని చేస్తుంది. అందుకే మా సమస్యలను స్వయంగా చేసేందుకు సీఎం కేసీఆర్ లేదా కేటీఆర్ ను బాసర రమ్మని అంటున్నాం వారు వచ్చేవరకు తమ ఆందోళన విరమించబోమని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు .

చాన్నాళ్లుగా తమకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని, క్యాంపస్ లో కనీస సౌకర్యాలు కూడా లేవని విద్యార్థులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గానీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గానీ క్యాంపస్ కు వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని చెబుతున్నారు.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాసర వెళ్తున్న సంజయ్ ను మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. కామారెడ్డి జిల్లా బికనూర్ వద్ద పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు.

 

Related posts

హెటెరోపై సీబీఐ కేసు కొట్టివేతకు నిరాకరించిన సుప్రీంకోర్టు!

Drukpadam

ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మిక బదిలీ!

Drukpadam

హెల్త్ ప్లాన్లలో టాపప్ – సూపర్ టాపప్ వేర్వేరు!

Drukpadam

Leave a Comment