వైఎస్ షర్మిలకు మంత్రి పువ్వాడ అజయ్ గట్టి కౌంటర్ ….

వైఎస్ షర్మిలకు మంత్రి పువ్వాడ అజయ్ గట్టి కౌంటర్ ….
-దమ్ముంటే ఖమ్మం లో నాపై పోటీచేయ …లేదా పాలేరులో నాదమ్ము చూపిస్తా !
-అన్నతో పంచాయితీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలి
-తెలంగాణకు వచ్చి ‘ఏం …… తావు…
-కండ్లల్లో తూటాలు పేల్చి పరిటాల రవిని హత్య చేసింది మీరే
-బయ్యారం ఉక్కు ఘనులు మింగింది మీరు కదా ?
-క్యాట్ వాక్ చేసి బిర్యానీలు తింటే సరిపోతుందా ?
-ఎవరేంటో తెలుసుకొని మాట్లాడాలి

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలపై తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఘాటుగా స్పందించారు . దుమ్ముంటే ఖమ్మం లో తనపై పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు . లేదా పాలేరు లో పోటీచేసిన అక్కడ తన దమ్ము ఏందో చూపిస్తానని వైఎస్ షర్మిలకు మంత్రి పువ్వాడ అజయ్ గట్టి కౌంటర్ …. ఇచ్చారు  . ఆమె నిన్న ఖమ్మం పర్యటనలో జరిగినసభలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి అజయ్ పై విమర్శలు గుప్పించారు . దానిపై అయన స్పందిస్తూ రోడ్ వెంట పోతుంటే కుక్కులు మొరిగితే వాటినిగురించు పట్టించుకొనవసరంలేదు అంటూనే షర్మిల విమర్శలపై ఘాటుగా స్పందించారు. పరిటాల రవిని కళ్ళలో తూటాలు పేల్చి చంపింది ఎవరు ? ముద్దు శ్రీను కదా ? ఆయన్ను కూడా చంపారు కదా ? బయ్యారం ఉక్కు ఘనులు మింగింది ఎవరు ? క్యాట్ వాక్ చేస్తూ బిర్యానీలు తింటే సరిపోతుందా ? ఎవరేంటో తెలుసుకొని మాట్లాడని విరుచుకపడ్డారు . ఆయన వాళ్ళ చరిత్ర తెలియనివారు ఎవరు ? అన్న ఏమి చేశాడు ….అయ్యా ఏమి చేశాడో తెలియని పిచ్చివాళ్ళు కాదు ప్రజలను అన్నారు . తాను నిరంతరం ప్రజల అభువృద్ది సంక్షేమం కోసం పనిచేస్తున్న విషయాన్నీ గుర్తు చేశారు .

షర్మిల రెడ్డికి తన సోదరుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పంచాయితీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలి కానీ తెలంగాణకు వచ్చి ఏం ….. అంటూ ఆమెపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ధ్వజమెత్తారు . ఖమ్మం ప్రజలు విజ్ఞులు అని ఎవరెంటో వారికి తెలుసునని మంత్రి అన్నారు.

ప్రజల పట్ల బాధ్యత లేనివాళ్ళు అప్పుడప్పుడు గంగిరెద్దులు వలె నాట్యమాడే వాళ్ళలా ఖమ్మంకి వస్తూ పోతుంటారని అన్నారు. నగరంలో 30-40 ఏళ్లుగా ఉన్న ఇండ్లు లేని పేదలకు ఒకేసారి ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని త్వరలో అందరికీ పట్టాలు అందిస్తామని తెలిపారు. రూ.150 కోట్ల రూపాయలతో టేకులపల్లిలోని కేసిఆర్ టవర్స్ వద్ద కార్పొరేట్ స్థాయిలో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం చేశామన్నారు. పేదలకు మంచి చేస్తుంటే కొందరు చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని చెప్పారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణ హక్కైన ఉక్కు గనులను ఆయన కొడుకు, కూతురు పేరిట దోచుకోవాలని చూశారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. ఎర్రి, మొర్రి మాటలు మాట్లాడేవాళ్ళని పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో తెలంగాణను పట్టి పీడించిన కడప పరిపాలకులు మళ్ళీ వస్తున్నారని అన్నారు. అడ్డ పంచెలు వేసుకొని కబ్జాలు చేసి దందాలు నడిపిన వారు మాట్లాడుతుంటే సిగ్గుగా ఉందన్నారు. వైఎస్ఆర్, జగన్ పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయని, పరిటాల రవిని హత్య చేసింది ఎవరో తెలుసునని విమర్శించారు.

పాదయాత్ర అని వైఎస్ షర్మిల క్యాట్ వాక్ చేస్తూ అర్ధగంట నడిచి ఏసి బస్సులో బస చేయడం, రూ. 300 కూలికి పిలిచి పాదయాత్ర చేపిస్తున్న విషయం అందరికీ తెలుసున్నారు. వట్టి పుణ్యానికి మంత్రి కాకపోతే మీ అన్న లాగా డబ్బులిచ్చి తీసుకోవాలా అని ప్రశ్నించారు. పని చేసిన వారికే సీఎం కేసిఆర్ గుర్తించి పదవులు ఇస్తారని అందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు. దమ్ముంటే ఖమ్మంలో తనపై పోటీ చేసి గెలిచి చూపించాలని పాలేరు లోనూ దమ్ము చూపిస్తానని వైఎస్ షర్మిలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సవాల్ విసిరారు.

Leave a Reply

%d bloggers like this: