Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

సికింద్రాబాద్​ విధ్వంసం సూత్రధారి సుబ్బారావు అరెస్ట్…!

సికింద్రాబాద్​ విధ్వంసం సూత్రధారి సుబ్బారావు అరెస్ట్…!
-గుంటూరులోనూ అల్లర్లకు ప్లాన్​ చేశాడని అభియోగాలు
-సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గా ఆవుల సుబ్బారావు
-వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి విద్యార్థులను రెచ్చిగొట్టినట్టు పోలీసుల గుర్తింపు
-అదుపులోకి తీసుకొని విచారిస్తున్న గంటూరు పోలీసులు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్లకు అసలు సూత్రధారిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు . ఆర్మీ ఉద్యోగాలకు సంబందించిన డిఫెన్స్ అకాడమీని సుబ్బారావు నడుపుతున్నాడు . అతనే విద్యార్థులను రెచ్చగొట్టి వాట్స్ అప్ మెస్సేజీల ద్వారా ఎప్పటికప్పుడు సందేశాలు పంపుతూ అల్లరులు చేసేలా ప్రోత్సహించాడని నిరాదరించుకున్న పోలీసులు అతన్ని గుంటూరు లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని పోలీసులు తేల్చారు. దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావు పేటలో అతడిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విధ్వంసం సృష్టించేలా ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులను అతను రెచ్చగొట్టినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. సికింద్రాబాద్ తరహాలో గుంటూరులో కూడా ఆందోళన చేపట్టాలని అతను ప్లాన్ చేశాడని గుర్తించారు. సుబ్బారావు గుంటూరులో సాయి డిఫెన్స్ అకాడమీ స్థాపించి ఆర్మీ అభ్యర్థులకు కోచింగ్ ఇస్తున్నాడు. ఇతర నగరాల్లో కూడా అకాడమీలు ఏర్పాటు చేశాడు.

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని సుబ్బారావు పలు వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి అభ్యర్థులకు పిలుపునిచ్చాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ముట్టడించాలని రెచ్చగొట్టాడు. సుబ్బారావు కూడా గుంటూరు నుంచి గురువారం రాత్రి హైదరాబాద్ కు వచ్చాడు. వాట్సప్ గ్రూపుల్లో ఎప్పటికప్పుడు సందేశాలు పంపించడంతోనే అల్లర్లు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు.

Related posts

తెల్లవారిన బతుకులు.. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున నెత్తురోడిన రోడ్లు.. 13 మంది బలి!

Drukpadam

మర్మాంగంలోకి ఎయిర్‌ బ్లోయర్ దూర్చడంతో పేగులు ఉబ్బి యువకుడి మృతి…

Ram Narayana

బీహార్ లో మాయమైన రైల్వే ట్రాక్!

Drukpadam

Leave a Comment