బాసర ట్రిపుల్ ఐటీ ఏవోను తొలగించిన ప్రభుత్వం!

బాసర ట్రిపుల్ ఐటీ ఏవోను తొలగించిన ప్రభుత్వం!

  • బాసర ట్రిపుల్ ఐటీలో నిరసనలు
  • డిమాండ్ల పరిష్కారం కోసం విద్యార్థుల ధర్నాలు
  • చర్చల్లో గందరగోళం
  • చర్చలు సఫలం అయ్యాయన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
  • చర్చలు విఫలం అయ్యాయంటున్న విద్యార్థులు
Telangana govt takes action on Basar IIIT EO

నిరసన బాట పట్టిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను శాంతింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బాసర ట్రిపుల్ ఐటీ ఏవోపై వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

అటు, విద్యార్థులు, ప్రభుత్వం మధ్య చర్చల్లో గందరగోళం ఏర్పడింది. చర్చలు సఫలం అయ్యాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొనగా, చర్చలు విఫలం అయ్యాయని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రేపు కూడా ఆందోళన కొనసాగిస్తామని వెల్లడించారు. బాసర ట్రిపుల్ ఐటీకి సీఎం కేసీఆర్ రావాలని పట్టుబడుతున్నారు.

విద్యార్థుల నిరసనల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి, ఆందోళన విరమణ కోసం వారిని కొందరు హెచ్ఓడీలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఆందోళన విరమించుకుంటే భోజనం పెట్టం అని హెచ్చరించిన హెచ్ఓడీని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడించారు.

Leave a Reply

%d bloggers like this: