కేసీఆర్ కు మద్దతుగా నిలుద్దాం …ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు గెలిపిద్దాం!

కేసీఆర్ కు మద్దతుగా నిలుద్దాంఉమ్మడి జిల్లాలో 10 సీట్లు గెలిపిద్దాం!
ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర , బండి పార్థసారథి రెడ్డిలకు అభినందన
రాజ్యసభ ఎన్నికల్లో అవకాశం కల్పించిన కేసీఆర్ కు ఖమ్మంలో భారీ కృతజ్ఞత సభ
తరలివచ్చిన వేలాదిమంది ప్రజలుసభకు హాజరైన జిల్లా టీఆర్ యస్ నేతలు
సభలో ఆటపాటలటపాసుల మోత రక్తి కట్టించింది

కేసీఆర్ కు మద్దతుగా నిలవడంద్వారా ..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 సీట్లకుగాను 10 సీట్లు గెలిపించించి నిజమైన కృతజ్ఞతలు తెలపాలని ఖమ్మం లో ఏర్పాటు చేసిన భారీ కృతజ్ఞత సభలో వక్తలు ఉద్ఘాటించారు . ఖమ్మం జిల్లాకు చెందిన వద్ద్దిరాజు రవిచంద్ర , బండి పారథసారథి రెడ్డిలకు ఇద్దరికీ ఒకేసారి రాజ్యసభ సీట్లు ఇవ్వడంద్వారా జిల్లాపై కేసీఆర్ కు ఉన్న ప్రేమకు ధన్యులమని అన్నారు . ఇది ఒక చరిత్ర …ఇంతకూ ముందెన్నడూ ఖమ్మం జిల్లాలో ఒకేసారి రెండు రాజ్యసభ సీట్లు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు . అందులో ఒక బీసీ బిడ్డగా పుట్టిన వద్దిరాజు రవిచంద్రకు ఇవ్వడం అంటే బీసీలపై కేసీఆర్ కు ఉన్న వాత్సల్యానికి నిదర్శనమన్నారు . ఆయన రాష్ట్రంలో బీసీలను బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి కేసీఆర్ కు అండగా నిలవాలని అన్నారు . ఇదే జిల్లాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్ చైర్మన్ బండి పార్థసారథి రెడ్డి కరోనా కష్టకాలంలో ప్రజలకు సకాలంలో మందులు అందించి అనేకమంది ప్రాణాలు కాపాడారని అలంటి వ్యక్తి ఖమ్మం జిల్లా వారుకావడం ఆయనకు రాజ్యసభ ఇవ్వడం గర్వకారణమని అన్నారు . కొత్తగా ఎన్నికైన రాజ్యసభలు కేసీఆర్ కు ఎన్నుదన్నుగా ఉంటూ జిల్లా అభివృద్ధిలో తమదైన ముద్ర వేయాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు .

గత 8 సంవత్సరాల కేసీఆర్ పాలనలో జిల్లాకు 50 వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వదా ద్వారా అభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. జిల్లాలో సీతారాం ప్రాజెక్టు పూర్తీ అయితే సస్యశ్యామలం అవుతుందని ఆకీర్తి కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు .

జిల్లాలో ఎందరో నాయకులూ ఉన్నప్పటికీ కొత్తవారికి ఇంతవరకు ఎలాంటి పదవులు అనుభవించని ఇద్దరు ఉత్సాహవంతులైన నాయకులకు దేశంలోనే అత్యున్నతమైన రాజ్యసభ సీట్లు ఇవ్వడం గొప్పవిషయమని ఇది కేసీఆర్ గొప్పమనసుకు నిదర్శనమని కేసీఆర్ పై వక్తలు ప్రశంసలు కురిపించారు . ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరావు తో కలిపి జిల్లాకు ఇప్పుడు 4 గురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారని అందరు కలిసి నామ ఆధ్వరంలో జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకోవాలని అన్నారు .

 

 

ఖమ్మం లోని సర్దార్ పటేల్ స్టేడియం లో జరిగిన భారీ సభకు ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా టీఆర్ యస్ అధ్యక్షులు తాతా మధు అధ్యక్షత వహించారు .సభలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , లోకసభలో టీఆర్ యస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి , కొత్తగూడం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు , సత్తుపల్లి శాశనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య , వైరా శాసనసభ్యుడు రాములు నాయక్ ,పాలేరు శాసనసభ్యుడు కందాల ఉపేందర్ రెడ్డి , ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావు , ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , తదితరులు ప్రసంగించారు . సభలో కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం , రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్ , చంద్రావతి ,
ఖమ్మం మేయర్ పూనుకొల్లు నీరజ , సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , డీసీఎంస్ చైర్మన్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు .

అంతకు ముందు ఖమ్మం సరిహద్దు గ్రామమైన నాయకన్ గూడెం వద్ద నుంచి భారీ మోటార్ సైకిల్ వాహనాలు, కార్లతో ర్యాలీగా ఖమ్మం చేరుకున్నారు . హైద్రాబాద్ నుంచి బయలుదేరిన నాయకులకు రింగ్ రోడ్ నుంచి ప్రారంభమైన స్వాగతాలు దారిపొడువున లభించడం విశేషం . ఇంతటి ఆదరణ తానెప్పుడూ చూడలేదని ఎంపీ నామ అన్నారు . సభలో ఆటపాటలతో పాటు , టపాసులు భారీగా పేల్చారు . ఇక ప్లైక్సీలతో ఖమ్మం నగరం నిండిపోయింది. ప్రత్యేకంగా బహిరంగ సభ వేదిక ఇరుపక్కలా ఏర్పాటు చేసిన కేసీఆర్ , కేటీఆర్ ప్లెక్సీలు , దేశ్ కి నేత కేసీఆర్ , తెలంగాణ నేత కేటీఆర్ అని పెట్టిన బోర్డు లు చూపరులను ఆకట్టుకున్నాయి.

ఈ సందర్బంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ఇంతటి గొప్పఅవకాశం కల్పించిన కేసీఆర్ కు జీవితాంతం రుణపడివుంటానన్నారు. రాష్ట్రంలో బీసీలను బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేస్తానని అన్నారు.

పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తమను గుర్తించి పెద్దలసభకు పంపడం జీవితంలో మరిచిపోలేని తీపి గుర్తు అన్నారు.ఆయన ఆలోచనలకు అణుగుణంగా నడుచుకుంటానని అన్నారు….

Leave a Reply

%d bloggers like this: