హైద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎంపీలు రవిచంద్ర , పార్థసారథి రెడ్డిలకు అడుగడుగునా స్వాగతం ,పూలవర్షం …

హైద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎంపీలు రవిచంద్ర , పార్థసారథి రెడ్డిలకు అడుగడుగునా స్వాగతం ,పూలవర్షం …
-సభకు ముస్తాబైన పటేల్ స్టేడియం
-ప్లెక్సీలతో నిండిపోయిన ఖమ్మం
-కేసీఆర్ ,కేటీఆర్ లతో సహా నాయకుల హోర్డింగ్ లు
-ఖమ్మంలో బైక్ ర్యాలీ …యువత కేరింతలు
-ముద్దులపల్లి నుంచి ఖమ్మం భారీ బైక్ ర్యాలీ

ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, పారథసారథి రెడ్డిలు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తరువాత మొదటి సరిగా ఖమ్మం వస్తున్న సందర్భంగా ఘనస్వాగం లభించింది. హైద్రాబాద్ లో బయలుదేరింది మొదలు ఖమ్మం వరకు లభించినా స్వాగతానికి నాయకులూ ముగ్దులైయ్యారు . ఇద్దరు రాజ్యసభ సభ్యులతో పాటు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కూడా వారి వెంట ఖమ్మం వస్తున్నారు. వారికీ రింగ్ రోడ్ మొదలు , చోటుప్పుల్ , చిట్యాల , నార్కెట్ పల్లి , నకిరేకల్ , సూర్యాపేట , నాయకన్ గూడెంలలో ఘన స్వాగతం లభించింది. అడుగడుగునా అభిమానులు టీఆర్ యస్ కార్యకర్తలు పూలవర్షం కురిపించారు . వారితో ఫోటోలు సెల్ఫీ లు దిగేందుకు ఆసక్తి చూపించారు .

వారికీ ఘనస్వాగం పలికేందుకు ఖమ్మం నగరం ముస్తాబైంది. ఖమ్మం నగరంలోని ప్రధాన కూడళ్లలో వారికీ స్వగతం పలుకుతూ పెద్ద పెద్ద ఫ్లక్క్సీ లు ఏర్పాటు చేశారు . బహిరంగసభ జరగనున్న ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం లో సీఎం కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ మంత్రి కేసీఆర్ లకు చెందిన పెద్ద పెద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేశారు . ఖమ్మంలో ఉదయం నుంచే ఎక్కడ చూసిన సందడి వాతారణం నెలకొన్నది . కొన్ని చోట్ల ప్లెక్సీలలో మెగాస్టార్ చిరంజీవి , పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా దర్శనమిచ్చాయి. ఇక పాట బస్సు స్టాండ్ నుంచి పటేల్ స్టేడియం వరకు ప్లేక్సీలతో ఖమ్మం పట్టణం గులాబీ మయంగా మారిపోయింది. ఎంపీలకు స్వాగతం పలికేందుకు వందలాదిగా మోటార్ సైకిళ్ళు ఖమ్మంలో కావత్ చేశాయి. ఎక్కడ చూసిన ఎంపీల రాక చర్చ జరుగుతుంది.

సాయంత్రం జరిగే బహిరంగ సభలో టీఆర్ యస్ ముఖ్యనేతలు పాల్గొని ప్రసంగిస్తారు . ఇప్పటికే ఎంపీ ల స్వాగత సభలో పాల్గొనేందుకు హైద్రాబాద్ మాజీ మేయర్ బొంతు రాంమోహన్ , మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులూ దేవయ్య పురుషోత్తం లు గత రాత్రే ఖమ్మం చేరుకున్నారు . ఖమ్మం లో కూడా మున్నూరు కాపు సంఘం ఆధ్వరంలో ఎంపీలకు స్వాగతం పలకనున్నారు . జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ , ఎంపీ నామ నాగేశ్వరరావు ,జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య , కందాల ఉపేందర్ రెడ్డి , వనమా వెంకటేశ్వరరావు , రేగా కాంతారావు , మెచ్చ నాగేశ్వరరావు , రాములు నాయక్ , హరిప్రియ, జిల్లా పరిషత్ ఖమ్మం ,కొత్తగూడెం జిల్లాల అధ్యక్షులు లింగాల కమల్ రాజ్ , కోరం కనకయ్య , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు సభలో పాల్గొననున్నారు .

 

 

Leave a Reply

%d bloggers like this: