హైద్రాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి టీఆర్ యస్ కు షాక్ …..

హైద్రాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి టీఆర్ యస్ కు షాక్ …..
కారు దిగిన కార్పొరేటర్ విజయారెడ్డి … కాంగ్రెస్ గూటికి ముహురథం ఈ నెల 23
టీఆర్ఎస్ ను వీడి.. కాంగ్రెస్​ లోకి పీజేఆర్ కూతురు విజయా రెడ్డి
ఈ నెల 23న కాంగ్రెస్ లో చేరుతానని ప్రకటన
రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత నిర్ణయం
ఖైరతాబాద్ కార్పొరేటర్ గా ఉన్న విజయారెడ్డి

దివగంత పీజేఆర్ కుమార్తె టీఆర్ యస్ కార్పొరేటర్ విజయారెడ్డి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు . టీఆర్ యస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించిన ఆమె కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు . అదికూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలోనే ప్రకటించడం గమనార్హం …ఆమె ఖైరతాబాద్ అసెంబ్లీ నుంచి పోటీచేయాలనే ఆలోచనతో ఉన్నారు . ఖైరతాబాద్ అసెంబ్లీ కి టీఆర్ యస్ పార్టీ నుంచి దానం నాగేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు . అందువల్ల అందులో ఉంటె ఖైరతాబాద్ లో టికెట్ రాదనే ఉద్దేశంతో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లు టీఆర్ యస్ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి మాజీ మంత్రి పి. జనార్దన్ రెడ్డి (పీజీఆర్) కూతురు పి. విజయా రెడ్డి షాకిచ్చారు. ఖైరతాబాద్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్ గా ఎన్నికైన విజయారెడ్డి ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు.

 

ఈ విషయాన్ని విజయారెడ్డి స్వయంగా వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశమైన అనంతరం ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. మంచి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు. పీజేఆర్ వారసత్వం కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఈ నెల 23వ తేదీన కాంగ్రెస్ లో చేరుతానని తెలిపారు. తనకిప్పుడు ఇంటిపార్టీలోకి వస్తున్నాననే భావన ఉందని అన్నారు.

పీజేఆర్ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన విజయారెడ్డి తర్వాత టీఆర్ఎస్ చేరారు. రెండు సార్లు కార్పొరేటర్ గా గెలిచారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఆశించిన ఆమెకు ఆ అవకాశం రాలేదు. టీఆర్ఎస్ లో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని విజయారెడ్డి చాన్నాళ్ల నుంచి అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

Leave a Reply

%d bloggers like this: