పాలేరు లో జెండా ఎగరాలి …ఇక్కడినుంచే పోటీ :నేలకొండపల్లి సభలో వైయస్ షర్మిల!

పాలేరు లో జెండా ఎగరాలి …ఇక్కడినుంచే పోటీ :నేలకొండపల్లి సభలో వైయస్ షర్మిల!
-ఖమ్మం గడప పాలేరు ఇక్కడ పోటీచేయమనే కోరిక మీదే కాదు …నాదికూడా
-దేవుడు కూడా తధాస్తు అంటాడని నా నమ్మకం
-ఈ రోజు నుండి నా ఊరు పాలేరు
-రాజశేఖర్ రెడ్డిని ఆదరించిన గడ్డ ఖమ్మం జిల్లా

-మంత్రి అజయ్ వ్యాఖ్యలపై స్పందన

 

పాలేరు లో వైయస్సార్ టీపీ జెండా ఎగరాలి …ఇక్కడనుంచి పోటీచేస్తా నాని వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రకటించారు … పాదయాత్రలో భాగంగా పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి లో జరిగిన సభలో ఆమె ఈ విషయం అభిమానులు ,పార్టీ కార్యకర్తల హర్షద్వానాల మధ్య ప్రకటించారు .ఖమ్మం గడప పాలేరు ఇక్కడ పోటీచేలానే కోరిక మీదే కాదు …నాదికూడా అని అన్నారు . రాజశేఖర్ రెడ్డిని ఆదరించిన గడ్డ పాలేరు వైయస్ ఆర్ వైయస్సార్ బిడ్డ పాలేరు నుండి పోటీ చేసేందుకు దేవుడు తథాస్తు అంటాడాని నా నమ్మకం అని పేర్కొన్నారు . మొట్ట మొదట పాలేరులోనే వైయస్సార్ జండా ఎగరాలని ఆమె అభిలషించారు . పాలేరు గెలవటానికి కాదు … కానీ వినీ ఎరుగని మెజార్టీ రావాలని అన్నారు . ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లాలో ఆఖరి రోజు ఆమె పాలేరు లో పాల్గొన్నారు . పాలేరు కు తరుచు వస్తుంటానని అక్కడ ప్రజలకు మాట ఇచ్చారు .

ఖమ్మం జిల్లా ప్రజలకు, వైయస్సార్ కార్యకర్తలకు ధన్యవాదాలు…నడిచింది నేనే అయినా, నడిపించింది మీరే…పాలేరు నియోజకవర్గ నాయకులందరికీ జేజేలు..నేను పాలేరు నుండి పోటీ చేయాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్సుమాలు..ఖమ్మం జిల్లా లో ఎంతమంది నాయకులు వైయస్సార్ ఫోటో పెట్టుకుని గెలిచారో మీకు తెలుసు…వైయస్సార్ అనే మూడక్షరాల పేరుకు వారసులం మనమే..ఖమ్మం జిల్లా అంటే వైయస్సార్ జిల్లా…ఖమ్మం జిల్లాకు గడప పాలేరు నియోజకవర్గం…ఎప్పటి నుండో వైయస్సార్ బిడ్డ పాలేరు నుండి పోటీ చేయాలని కోరుతున్నారు…నేను కూడా ఇక్కడ నుంచే పోటీచేయాలని అనుకుంటున్నాను … అని అన్నారు .

మంత్రి అజయ్ వ్యాఖ్యలపై స్పందన

నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్న …బయ్యారంలో ఎలాంటి   భాగం లేదు…అదే ఈ జిల్లా మంత్రిని తన బిడ్డల మీద ఓట్టేసి అవినీతి, అక్రమాలో భాగం లేదని..నీకు దమ్ముంటే నాలుగు రోజులు మాతో కలిసి పాదయాత్ర చేయండి…మీకు దిమ్మ తిరిగి సొమ్మసిల్లి, మీ హాస్పిటల్ అంబులెన్స్ లోనే ఆసుపత్రికి వెళ్ళాలి…వైయస్సార్ కాలిగోటికి పువ్వాడ అజయ్ పనికిరాడు
పిచ్చి పిచ్చి గా మాట్లాడితే పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతారు…వైయస్సార్ అభిమానులంతా ఆయన వారసులే…అడుగు ముందుకు వేశాం, ఆ అడుగు ముందుకే వెళ్ళాలి…భయపడకుండా పోరాటం చేయండి, నేను మీ చెంతనే ఉంటా…కేసిఆర్ అనే కొండను డీ కొడ్తున్నాం… అధికారంలోకి వస్తాం… ఆమె అన్నారు .

Leave a Reply

%d bloggers like this: