ప్రేమించిన ఎమ్మెల్యే  మోసం చేశాడు …ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు!

ప్రేమించిన ఎమ్మెల్యే  మోసం చేశాడు …ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు!
-ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి రిజిస్ట్రార్ ఆఫీసుకు రాలేదు
-బీజేడీ ఎమ్మెల్యే విజయ్‌శంకర్ దాస్‌పై ఫిర్యాదు
-పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించారన్న బాధితురాలు
-సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వేచి చూసి వెళ్లిపోయానన్న యువతి
-మోసపోయినట్టు గుర్తించి ఫిర్యాదు చేశానని వెల్లడి

మూడు సంవత్సరాలుగా ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళికి దరఖాస్తు కూడా చేసుకొని అక్కడికి రాకుండా ,ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన ఎమ్మెల్యే పై ఒడిశాలో ఒక యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అధికార బిజెడి కి చెందిన ఎమ్మెల్యే విజయ శంకర్ దాస్ యువతిని ప్రేమించి మోసం చేసిన ఘటనలో పోలీసులు వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు .

తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన ఎమ్మెల్యే ఆ తర్వాత మోసం చేశారంటూ ఒడిశాకు చెందిన యువతి బీజేడీ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా తిర్తోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ్‌శంకర్ దాస్, తాను ప్రేమించుకున్నామని సోమాలిక దాస్ అనే యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ వివాహానికి ఇరు కుటుంబాల వారు అంగీకరించారన్నారు.

పెళ్లి కోసం జగత్సింగ్‌పూర్‌లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో మే 17న దరఖాస్తు కూడా చేసుకున్నామన్నారు. శుక్రవారం స్లాట్ ఇవ్వడంతో ఎమ్మెల్యే రాలేదని, చాలాసేపు ఆయన కోసం చూసి వెళ్లిపోయినట్టు చెప్పారు. ఫోన్ చేసినా స్పందించలేదని, దీంతో తాను మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సోనాలిక తెలిపారు.

పైగా తన సోదరులు ఇతర కుటుంబసభ్యులతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు . ఇది అత్యంత దుర్మార్గమని తనకు న్యాయం చేయాలనీ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేపై 420 ,195 ఏ 294 ,509 ,34 ,34 ఎచ్ 120 బి లకింద కేసులు నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు .

నేను పెళ్ళికి నిరాకరించలేదు … రిజిస్ట్రేషన్ కు మరో 60 రోజుల   సమయం ఉంది …ఎమ్మెల్యే

తాను పెళ్లిని నిరాకరించినట్లు వస్తున్నా వార్తల్లో ఎంతమాత్రం నిజంలేదని రిజిస్ట్రేషన్ కు మరో 60 సమయం ఉందని ఎమ్మెల్యే విజయ శంకర్ దాస్ తెలిపారు . తనపై తన ప్రేమికురాలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినదానిపై విలేకర్లు ఆయన స్పందన కోరగా పై విధంగా స్పందించారు . ముందుగానే ఆమెకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు . ఫోన్ ఎందుకు ఎత్తలేదని దానికి ఆయన సమాధానం ఇవ్వలేదు ..

 

Leave a Reply

%d bloggers like this: