సరదాగా సైకిల్ తొక్కుతూ కిందపడిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. 

సరదాగా సైకిల్ తొక్కుతూ కిందపడిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. 

  • డెలావర్‌లోని  ఆయన ఇంటి సమీపంలోనే ఘటన
  • తనను చూసేందుకు వచ్చిన వారిని కలిసేందుకు సైకిలెక్కిన అధ్యక్షుడు
  • పెడల్‌లో పాదం ఇరుక్కుపోవడంతో తూలి కిందపడిన వైనం

సరదాగా సైకిలెక్కిన అమెరికా అధ్యక్షుడు జో బెడైన్ కిందపడ్డారు. అయితే, ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డెలావర్‌లోని తన నివాసానికి సమీపంలో ఉన్న కేప్ హెన్లోపెన్ పార్క్ వద్ద ఈ ఘటన జరిగింది. తనను చూసేందుకు వచ్చిన వారి వద్దకు వెళ్లేందుకు బైడెన్ సైకిలెక్కి బయలుదేరారు.

సైకిల్ దిగే సమయంలో బైడెన్ పాదం పెడల్‌లో ఇరుక్కుపోయింది. దీంతో కిందికి దిగాలని భావించారు. ఈ క్రమంలో తూలి కుడివైపునకు పడిపోయారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే ఆయనను పైకి లేపారు. ఈ ఘటన తర్వాత బైడెన్ మాట్లాడుతూ.. తాను బాగానే ఉన్నానని, ఆందోళన అవసరం లేదని అన్నారు. ఈ ఘటనలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: