కన్నడ నటుడు దారుణ హత్య…

దారుణ హత్యకు గురైన కన్నడ నటుడు… మూడు నెలల కిందట భార్య ఆత్మహత్య

  • రక్తపు మడుగులో సతీష్ వజ్ర
  • రక్తం ఇంటి నుంచి బయటికి పారిన వైనం
  • దిగ్భ్రాంతికి గురైన ఇంటి యజమాని
  • భార్య తరఫు బంధువులే అన్న అనుమానం 

కన్నడ నటుడు సతీష్ వజ్ర తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో పడివున్న స్థితిలో సతీష్ వజ్ర మృతదేహాన్ని గుర్తించారు. మూడు నెలల కిందటే సతీష్ భార్య ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. సతీష్ వజ్ర బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. అయితే, అతడి ఇంటి నుంచి రక్తం బయటికి వస్తుండడాన్ని గమనించిన ఇంటి యజమాని లోపలికి వెళ్లి పరిశీలించాడు. రక్తపు మడుగులో విగతజీవుడిలా సతీష్ వజ్ర పడి ఉండడాన్ని గుర్తించి దిగ్భ్రాంతికి గురయ్యాడు.

తన ఇంటి సీసీ టీవీ ఫుటేజి పరిశీలించిన ఆయన ఇది హత్యేనని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నటుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

నిన్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సతీష్ వజ్రతో గొడవపడినట్టు తెలిసింది. వారే వేట కొడవళ్లతో హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. సతీష్ వజ్ర భార్య ఇటీవలే బలవన్మరణం చెందింది. వారిద్దరూ పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆమె మృతికి ప్రతీకారంగా ఆమె సోదరుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ఓ అంచనాకు వచ్చారు. ఆమె సోదరుడు, ఇతర బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: