సోనియా గాంధీ.. ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జీ!

క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్న సోనియా గాంధీ.. ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జీ!

  • ఇటీవ‌లే క‌రోనా బారిన ప‌డిన సోనియా
  • చికిత్స నిమిత్తం స‌ర్ గంగారామ్ ఆసుప‌త్రిలో చేరిక‌
  • వారం రోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స
  • క‌రోనా నుంచి పూర్తిగా కోలుకోవ‌డంతో ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జీ

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ సోమ‌వారం సాయంత్రం ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఇటీవ‌లే క‌రోనా సోకిన నేప‌థ్యంలో చికిత్స నిమిత్తం ఆమె ఢిల్లీలోని స‌ర్ గంగారామ్ ఆసుప‌త్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. వారం రోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న ఆమె క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఆమెను ఆసుప‌త్రి వైద్యులు సోమ‌వారం సాయంత్రం డిశ్చార్జీ చేశారు. కాసేప‌టి క్రితం  సోనియా గాంధీ ఆసుప‌త్రి నుంచి త‌న నివాసానికి చేరుకున్నారు.

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీకి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ స‌మ‌న్లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈడీ స‌మ‌న్లు అందుకున్నాకే సోనియా గాంధీ క‌రోనా బారిన ప‌డ్డారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలే ఉన్నా… వ‌య‌సు రీత్యా నెల‌కొన్న అనారోగ్య స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో ఆమెను స‌ర్ గంగారామ్ ఆసుప‌త్రికి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే.

ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంలో కుమారుడు రాహుల్ , కుమార్తె ప్రియాంక గాంధీ నిత్యం తల్లి ఆరోగ్య పై శ్రద్ద వహించారు . ఒకపక్క రాహుల్ ఈడీ విచారణకు హాజరౌతూనే మరోపక్క తల్లి కోసం రోజు ఆసుపత్రి వెళ్లి వచ్చేవారు … సోనియా గాంధీ కూడా ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె కు కరోనా నేపథ్యంలో ఆమె ఈ నెల 23 న హాజరు కావాల్సివుంది.

Leave a Reply

%d bloggers like this: