ఉజ్జయిన్ జైల్లో ఖైదీలకు పౌరోహిత్యంలో శిక్షణ!

ఉజ్జయిన్ జైల్లో ఖైదీలకు పౌరోహిత్యంలో శిక్షణ!
-జైల్లో ఖైదీల పరివర్తనకు అనేక ప్రయత్నాలు
-తాజాగా పౌరోహిత్యం కోర్సు
-30 రోజుల పాటు శిక్షణ
-ఉత్తీర్ణులకు సర్టిఫికెట్ల ప్రదానం

క్షణికావేశంలో హత్యలకు పాల్పడినవారు, మోసాలు, ఘోరాలకు పాల్పడిన వారికి జైల్లో పరివర్తన కలిగించేందుకు అనేక చర్యలు తీసుకుంటుంటారు. ఈ క్రమంలో ఖైదీలకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇస్తుంటారు. తోటపని, నవ్వారు, కొవ్వొత్తుల తయారీ, చదువుపై ఆసక్తి ఉన్నవారికి వివిధ కోర్సులు అభ్యసించే అవకాశం కల్పిస్తుంటారు. తాజాగా, మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ జైల్లో వినూత్నంగా ఖైదీలకు పౌరోహిత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం 30 రోజుల కోర్సును అందుబాటులోకి తెచ్చారు.

విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన వారికి గాయత్రి మంత్ర గ్రంథం, సర్టిఫికెట్ అందజేస్తారు. ఆలయాల్లో అర్చకత్వంతో పాటు హోమాలు, యజ్ఞయాగాదులు చేయడంలో వీరికి తర్ఫీదునిస్తారు. కోర్సులో భాగంగా ఖైదీలకు ఆధ్యాత్మిక పాఠాలు బోధిస్తారు. ఈ ఆలోచన జైలు సూపరింటిండెంట్ ఉషా రాజేది. ఆమె ఎంతో చొరవ తీసుకుని గాయత్రి వేద పండితుల సాయంతో ఖైదీలను ఆధ్యాత్మికత, పౌరోహిత్యం వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటిదాకా 100 మంది వరకు ఖైదీలకు పౌరోహిత్యంలో శిక్షణ ఇవ్వడం విశేషం.

Leave a Reply

%d bloggers like this: