ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు గుండెపోటు…

ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు గుండెపోటు…
-ఉన్న‌ట్టుండి అస్వ‌స్థ‌త‌కు గురైన ద‌గ్గుబాటి
-హుటాహుటీన అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించిన కుటుంబ స‌భ్యులు
-ద‌గ్గుబాటి గుండెలో స్టెంట్ అమ‌ర్చిన వైద్యులు
-ఆసుప‌త్రిలో ద‌గ్గుబాటిని ప‌రామ‌ర్శించిన చంద్రబాబు

తెలుగు నేల‌కు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు అల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు మంగ‌ళ‌వారం హైదరాబాదులో గుండెపోటుకు గుర‌య్యారు. అయితే చాలా వేగంగా స్పందించిన ఆయ‌న కుటుంబ స‌భ్యులు హుటాహుటీన ఆయ‌న‌ను అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ద‌గ్గుబాటికి చికిత్స అందించిన వైద్యులు… ఆయ‌న గుండెలో స్టెంట్‌ను అమ‌ర్చారు. దీంతో ఆయ‌న ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు.

ఈ విష‌యం తెలుసుకున్న వెంట‌నే టీడీపీ అధినేత‌, ద‌గ్గుబాటి తోడ‌ల్లుడు నారా చంద్ర‌బాబునాయుడు హుటాహుటీన అపోలో ఆసుప‌త్రికి చేరుకున్నారు. అప్ప‌టికే స్టెంట్ అమ‌ర్చ‌డంతో ఊపిరి పీల్చుకున్న ద‌గ్గుబాటిని చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు. ద‌గ్గుబాటి ఆరోగ్యంపై చంద్ర‌బాబు అపోలో ఆసుప‌త్రి వైద్యుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. స‌కాలంలో ఆసుప‌త్రికి రావ‌డంతో స్టెంట్ అమ‌ర్చామ‌ని, ద‌గ్గుబాటికి ఇక ప్ర‌మాద‌మేమీ లేద‌ని చంద్ర‌బాబుకు వైద్యులు తెలిపారు. తోడల్లులు ఇద్దరు కలిసినప్పటికీ చాలాకాలం తరువాత ఆరోగ్యం గురించి , యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు .

Leave a Reply

%d bloggers like this: