ప్రధాని మోదీ యోగాసనాలు….

యోగాసనాలు వేసిన ప్రధాని మోదీ.. ప్రపంచ దేశాలకు ధన్యవాదాలు!

  • మైసూరులో యోగాసనాలు వేసిన మోదీ
  • యోగా ఏ ఒక్కరికో చెందినది కాదన్న ప్రధాని
  • యోగాభ్యాసంతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడతాయన్న మోదీ
  • సంతోషం, ఆరోగ్యం, శాంతికి యోగా దినోత్సవం సూచికని చెప్పిన ప్రధాని

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యోగా ఏ ఒక్కరికో చెందినది కాదని, అది అందరిదీ అని పేర్కొన్నారు. యోగాభ్యాసంతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడతాయన్నారు. యోగాను గుర్తించిన ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలకు ఈ సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు.

కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుందన్న మోదీ.. ఆరోగ్యం, సంతోషం, శాంతికి యోగా దినోత్సవం సూచిక అని అన్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పి సమస్యల పరిష్కారానికి యోగా దోహదం చేస్తుందన్నారు. మానవ జీవన విధానానికి మార్గంగా నిలిచే యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Leave a Reply

%d bloggers like this: