Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

‘మహా’ సర్కారు కుప్పకూలడం ఖాయమేనా?గంటగంటకు మారుతున్న పరిణామాలు !

‘మహా’ సర్కారు కుప్పకూలడం ఖాయమేనా?గంటగంటకు మారుతున్న పరిణామాలు !
-రంజుగా ‘మహా’ రాజకీయాలు
-మైనారిటీలో మహా వికాస్ అఘాడీ సర్కారు
-విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తే ఉద్ధవ్‌కు కష్టమే!

మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్ కుప్పకూలడం ఖాయమేనా అంటే అక్కడకు వచ్చిందని అంటున్నారు పరిశీలకులు . ఎలాంటి ఉరుములు ,మెరుపులు లేకుండా ఒక్కసారిగా తుఫాన్ వచ్చిన చందంగా ఎకనాథ్ షిండే అనే శివసేన మంత్రి ఒక్కసారిగా మహా సర్కార్ పై తిరుగుబాటు వేగరవేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు శివవసైనికులు

శివసేన సీనియర్ నేత, రాష్ట్రమంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు రంజుగా మారాయి .  గంటగంటకు మారుతున్న పరిణామాలు.

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కారణమైన శివసేన ఎమ్మెల్యే, మంత్రి ఏక్‌నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి ఈ ఉదయం బీజేపీ పాలిత రాష్ట్రమైన అసోంలోని గువాహటి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్డీటీవీ (NDTV)తో ఆయన మాట్లాడుతూ.. తనకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. వారిలో 40 మంది సేన ఎమ్మెల్యేలు కాగా, ఆరుగురు స్వతంత్రులని పేర్కొన్నారు. పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించిన షిండే.. పార్టీ నుంచి తాను దూరంగా వెళ్లబోనని, బాలాసాహెబ్ థాకరే సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తానని అన్నారు.

తాము హిందుత్వను విశ్వసిస్తామని, బాలాసాహెబ్ థాకరే శివసేన పార్టీకి తాను దూరం జరగబోనని షిండే స్పష్టం చేశారు. పార్టీని చీల్చే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. గువాహటి విమానాశ్రయంలో షిండేకు బీజేపీ నేతలు పల్లబ్ లోచన్ దాస్, సుశాంత బోర్గోహెయిన్ షిండే స్వాగతం పలికారు. షిండే, ఇతర ఎమ్మెల్యేల కోసం సిద్ధం చేసిన పైవ్ స్టార్ హోటల్‌లో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కనిపించారు.

తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో కలిసి గువాహటి చేరుకోవడానికి ముందు ఏక్‌నాథ్ షిండే గుజరాత్‌లోని సూరత్ హోటల్‌లో మకాం వేశారు. నిన్న సాయంత్రం పొద్దుపోయాక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. షిండేతో పది నిమిషాలపాటు టెలిఫోన్‌లో మాట్లాడారు. వెనక్కి రావాలని కోరారు. అయితే, కాంగ్రెస్-ఎన్సీపీతో పొత్తును విరమించుకుని బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని షిండే డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, సేన నేతల నుంచి ఎలాంటి ఇబ్బందులు, ప్రలోభాలు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతోనే షిండే తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో కలిసి అసోంకు మకాం మార్చారు.

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. వాటిలో బీజేపీకి 106మంది ఎమ్మెల్యేలు ఉండగా, శివసేనకు 55, కాంగ్రెస్‌కు 44, ఎన్సీపీకి 54 మంది శాసనసభ్యులు ఉన్నారు. స్వతంత్రులు, ఇతర పార్టీల సభ్యులు కలిసి మరో 29 మంది ఉన్నారు. ఎంవీఏ సర్కారుకు ప్రస్తుతం 152 మంది సభ్యుల బలం ఉంది. అయితే, ఓ ఎమ్మెల్యే మరణించడంతో అసెంబ్లీలో సంఖ్యాబలం 287గా ఉంది. ఈ లెక్కన విశ్వాస పరీక్ష పెడితే అధికార కూటమికి 144 మంది సభ్యుల బలం అవసరం.

అయితే, వీరిలో 21 మంది సేన ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేయడంతో ఆ పార్టీ శాసనసభ్యుల సంఖ్య 34కు పడిపోయింది. వీరిని తీసేస్తే సంకీర్ణ ప్రభుత్వ బలం 130కి పడిపోయి మైనార్టీలో పడిపోతుంది. తిరుగుబాటు చేసిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే సభలో కొత్త మెజారిటీ మార్కు 133 అవుతుంది. అదే జరిగితే బీజేపీ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. ఎందుకంటే.. సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు 134 ఓట్లు వచ్చాయని బీజేపీ చెబుతోంది. కాబట్టి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వస్తే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని చెబుతున్నారు.

అసెంబ్లీ రద్దు దిశగా సేన సంకేతాలు.. ఆసక్తికరంగా ‘మహా’ రాజకీయం
అసెంబ్లీ రద్దు దిశగా పరిణామాలంటూ సంజయ్ రౌత్ పోస్ట్

మహారాష్ట్రలో అధికార సంకీర్ణానికి నేతృత్వం వహిస్తున్న శివసేన.. అసెంబ్లీ రద్దు దిశగా సంకేతాలు ఇస్తోంది. శివసేనకు చెందిన మంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో సుమారు 40 మంది శివసేన ఎమ్మెల్యేలు వేరే రాష్ట్రంలో మకాం వేయడం, వారితో సీఎం ఉద్దవ్ థాకరే చర్చలు విఫలం కావడం తెలిసిందే.

మరోపక్క, షిండే ఎప్పటి నుంచో శివ సైనికుడని, అతడు తమతోనే ఎప్పటికీ ఉంటాడని, చర్చలు జరుగుతున్నాయని ప్రకటించిన సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్వరం మార్చారు. ‘మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు విధాన సభ రద్దు దిశగా కొనసాగుతున్నాయి’’ అంటూ ఆయన మరాఠీలో ఓ పోస్ట్ పెట్టారు.

అయితే, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. మహారాష్ట్రలో సంకీర్ణ ఎంవీఏ సర్కారు విధాన సభ రద్దుకు సిఫారసు చేస్తే దాన్ని గవర్నర్ ఆమోదించాల్సిన అవసరం లేదు. గవర్నర్ కు ఆమోదం అయితే సభను రద్దు చేయవచ్చు. అప్పుడు తాజా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు బీజేపీ, ఎంఎన్ఎస్, ఇతర ప్రత్యర్థి చిన్న పార్టీలు ఒక కూటమిగా.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఒక కూటమిగా ప్రజల ముందుకు వెళ్లొచ్చు.

ఒకవేళ సభ రద్దు సిఫారసును గవర్నర్ తోసిపుచ్చితే.. అప్పుడు సభలో మెజారిటీ నిరూపించుకోవాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరతారు. విఫలమైతే అప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో లేఖ సమర్పించిన వారిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారు. అప్పుడు శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. అయితే, కీలకమైన సంక్షోభ సమయంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరడం గమనార్హం.

Related posts

పవన్ కళ్యాణ్ బీజేపీ తో కొనసాగటం పై సందేహాలు… ?

Drukpadam

బైడెన్‌పై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. ఒక్క క్షణం కూడా నిలవడేమో అంటూ..

Drukpadam

ఖమ్మం లో కాంగ్రెస్ కాంగ్రెస్ కు గుడ్ బై … 200 మంది తెరాసలో చేరిక…

Drukpadam

Leave a Comment