అక్కడ భార్యకు ముద్దు పెట్టకూడదట ….

అక్కడ భార్యకు ముద్దు పెట్టకూడదట ….
సరయూ నదిలో స్నానం చేస్తూ భార్యకు ముద్దు.. చితకబాదేసిన జనం:
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఘటన
అయోధ్యలో అలాంటివి కూడదంటూ దాడిచేసిన జనం
వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు
నిందితులపై చర్యలు తప్పవని హెచ్చరిక

నదిలో స్నానం చేస్తూ భార్యకు ముద్దు పెట్టిన భర్తపై కొందరు యువకులు దాడి చేసి చితకబాదారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వివరాల్లోకి వెళ్తే.. పవిత్ర సరయూ నదిలో ఓ జంట స్నానానికి దిగింది. ఈ క్రమంలో భార్యకు భర్త ముద్దు పెట్టాడు. పక్కనే స్నానం చేస్తున్నవారు అది చూసి అతడిపై దాడికి దిగారు.

అయోధ్యలో ఇలాంటి వాటిని సహించబోమంటూ మూకుమ్మడిగా దాడిచేశారు. నది నుంచి బయటకు లాక్కుంటూ దాడి చేశారు. భార్య అడ్డం పడుతున్నా ఆగలేదు సరికదా, తిడుతూ అతడిని కొడుతూనే ఉన్నారు. ఓ వ్యక్తి మాత్రం వారిని అడ్డుకుని ఆ జంటను బయటకు పంపాడు. ఈ ఘటన మొత్తాన్ని ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. అది తిరిగి తిరిగి పోలీసుల దృష్టిలో పడడంతో స్పందించిన పోలీసులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: