వేలాది మంది సమక్షంలో డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్ అపర్ణ ల ఎంగేజిమెంట్ !

వేలాది మంది సమక్షంలో డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్ అపర్ణ ల ఎంగేజిమెంట్ !
-మాజీ ఎమ్మెల్యే తాత పువ్వాడ నాగేశ్వరరావు , నానమ్మ విజయలక్ష్మి ల ఆశీర్వాదం తో అత్యంత ఘనంగా జరిగిన వేడుక
-ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తరలిన వేలాది మంది
-హాజరైన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పలువురు మంత్రులు , ఎంపీలు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు ఇతర ప్రముఖులు

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వసంత లక్ష్మి ల తనయుడు డా.పువ్వాడ నయన్, అపర్ణ ల నిశ్చయ తాంబూల వేడుక తాత, నానమ్మ మాజీ ఎమ్మేల్యే పువ్వాడ నాగేశ్వర రావు, విజయ లక్ష్మి ల ఆశీర్వాదంతో హైద్రాబాద్ లోని శంషాబాద్ జీఎంఆర్ ఏరినా ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు వేలాది మంది తరలి వచ్చారు కాబోయే వధూవరులను

ఆశీర్వదించారు .

 

ఈ వేడుకలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి , శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , సహచర మంత్రులు తన్నీరు హరీష్ రావు , మహ్మద్ అలీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , తలసాని శ్రీనివాసయాదవ్ , సత్యవతి రాథోడ్ , వేముల ప్రశాంత్ రెడ్డి , ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ , పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు , వద్దిరాజు రవిచంద్ర , బండి పార్థసారధి రెడ్డి , రంజిత్ రెడ్డి , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి , శాసన సభ శాసన మండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మధు సూదన్ , ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లు విపి గౌతమ్ , అనుడీప్ , విష్ణు ఎస్ వారియర్ , సునీల్ దత్ , ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి , ఎమ్మేల్యేలు సండ్ర వెంకటవీరయ్య , మెచ్చా నాగేశ్వరరావు, లగడపాటి రాజగోపాల్ , కోరుకంటి చందర్ , వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ , జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , మేయర్ పునుకొల్లు నీరజ , సుడా చైర్మన్ బచ్చు విజయ్ , వైరా మాజీ ఎమ్మెల్యే మధన్ లాల్, వివిధ శాఖల అధికారులు, పారిశ్రామిక వేత్తలు, కార్పొరేటర్లు, టీఆర్ యస్ రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు తదితరులు వచ్చి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అనేక మంది ప్రముఖులు ఖమ్మం జిల్లా నుంచి వేలాదిగా తరలి వచ్చారు . ఒక్క ఖమ్మం నుంచే వెయ్యికి పైగా కార్లు వచ్చినట్లు అంచనా …ఎంగేజ్ మెంట్ కె ఇంతమంది వస్తే పెళ్ళికి ఇంకా ఎంతమంది వస్తారోననే చర్చ జరిగింది. వచ్చిన వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజనాలు ఏర్పాటు చేశారు . ఎయిర్ పోర్ట్ ప్రాంగణం కావడంతో వాహనాల పార్కింగ్ కు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఘనంగా చేశారు .

 

డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్ అపర్ణ ల ఎంగేజిమెంట్ దృశ్యాలు 

 

 

Leave a Reply

%d bloggers like this: