Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి జై కొట్టిన జగన్!

ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి జై కొట్టిన జగన్!
గిరిజన మహిళకు అత్యున్నత పదవి ఇవ్వడపట్ల హర్షం
నామినేషన్ కార్యక్రమం లో పాల్గొన్న వైయస్సార్ సీపీ
ఇది ఒక చారిత్రిక నిర్ణయమన్న విజయసాయి రెడ్డి
కార్యక్రమం లో పాల్గొన్న విజయసాయి , మిథున్ రెడ్డి

రాష్ట్రపతి ఎన్నికల్లో అనుకున్నట్లుగానే వైఎస్ఆర్సిపి బిజెపి బలపరుస్తున్న ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి జై కొట్టింది.ఏపీ సీఎం జగన్ సూచనల మేరకు నేడు జరిగిన నామినేషన్ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పాల్గొని తమ మద్దతును ప్రకటించింది. దేశంలోని అత్యున్నత మైన రాష్ట్రపతి పదవికి ఒక గిరిజన మహిళను పోటీకి పెట్టడం హర్షణీయమని వైఎస్ఆర్సిపి పేర్కొంది. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఇలాంటి బడుగు బలహీన వర్గాలకు కీలక పదవులు కట్టబెట్టడం శుభపరిణామమని పేర్కొన్నది . అదే తమ పార్టీ లక్ష్యమని వైఎస్సార్సీపీ నేత విజయ విజయ సాయి రెడ్డి అన్నారు .

నేడు జరిగిన నామినేషన్ కార్యక్రమంలో పార్టీ తరుపున విజయసాయిరెడ్డి తో పాటు లోక్ సభలో వైసీపీ పక్ష నేత మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వైయస్సార్సీపి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం లక్ష్యంగా పని చేస్తుందని, అందులో భాగంగానే రాష్ట్ర క్యాబినెట్ తో పాటు వివిధ పదవులలో వారి భాగస్వామ్యం పెంచుతుందని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గుర్తు చేశారు . తమ ఆలోచనలకు అనుగుణంగానే రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్ డి ఎ ప్రకటించటం హర్షణీయమని వారు పేర్కొన్నారు. అందువల్ల తమ పార్టీ ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని బలపరుస్తుంది , పేర్కొన్నారు .

రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇతర ఎన్డీయే నేతలు,ఒడిశా కు చెందిన బిజూ జనతాదళ్ నేతలు ,ఏ ఐ డి ఎం కె నేతలు పాల్గొన్నారు .

సీఎం ర‌మేశ్‌తో పాటు వైసీపీ ఎంపీలు మ‌రో ఇద్ద‌రికి ఆ అవ‌కాశం!

ysrcp mps vijay sai reddy and mithun reddy also proposed murmu candidature from andhra pradesh

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా ఎంపికైన ద్రౌప‌ది ముర్ము శుక్ర‌వారం త‌న నామినేష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌హా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్‌లు వెంట రాగా… పార్ల‌మెంటు సెక్ర‌టేరియ‌ట్‌లో ముర్ము నామినేష‌న్ వేశారు. ఈ కార్య‌క్ర‌మానికి వైసీపీ నుంచి ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి, లోక్‌స‌భ‌లో పార్టీ నేత పెద్దిరెడ్డి వెంక‌ట మిథున్ రెడ్డిలు కూడా హాజ‌ర‌య్యారు.

ఇదిలా ఉంటే… ద్రౌప‌ది ముర్ము అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌తిపాదిస్తూ ఓటు హ‌క్కు క‌లిగిన 50 మంది సంత‌కాలు చేయ‌గా, మ‌రో 50 మంది ఆ ప్ర‌తిపాద‌న‌ల‌ను బ‌ల‌ప‌ర‌చాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ముర్ము అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌తిపాదించే అవ‌కాశం ఏపీ నుంచి త‌న‌కు ఒక్క‌డికి మాత్ర‌మే ద‌క్కిందంటూ గురువారం ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం ర‌మేశ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే సీఎం ర‌మేశ్‌తో పాటు ముర్ము అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌తిపాదిస్తూ ఏపీకి చెందిన మ‌రో ఇద్ద‌రు నేత‌లు కూడా సంత‌కాలు చేశారు. వారు వైసీపీ ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు. వెర‌సి ముర్ము అభ్య‌ర్థిత్వాన్ని ఏపీ నుంచి ప్ర‌తిపాదించిన వారి సంఖ్య 3కు చేరింది.

 

 

Related posts

పోడుభూముల సమస్యపై ఎర్ర జెండాల పోరుబాట …

Drukpadam

ఏపీలో కొత్త జిల్లాల‌కు కేబినెట్ ఆమోదం…

Drukpadam

అరబిందో నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్ వసూలు చేశారు: కొడాలి నాని!

Drukpadam

Leave a Comment