Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ జాతీయపార్టీ ప్రకటన మరికొద్దికాలం…

కేసీఆర్ జాతీయపార్టీ ప్రకటన మరికొద్దికాలం…
-రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కేసీఆర్ జాతీయ పార్టీ…?
-రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రకటన వాయిదా
-పార్టీ ప్రకటనకు ముందే దేశంలో ఉన్న ప్రధాన సమస్యలపై అధ్యనం
-వచ్చే నెల రెండో వారం వరకు వివిధ రంగాల నిపుణులతో సమావేశం
-నిన్న ప్రగతి భవన్‌లో జాతీయ మీడియా ప్రముఖులతో చర్చ

కొత్త పార్టీతో జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని నిర్ణయించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెలలో కొత్త పార్టీని ప్రకటిస్తారన్న వార్తలు వచ్చాయి. ఆ పార్టీ పేరు ‘భారతీయ రాష్ట్ర సమితి’ అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే, రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతానికి పార్టీ ఏర్పాటు ప్రకటనను వాయిదా వేసుకున్నారని, రాష్ట్రపతి ఎన్నికల తర్వాత పార్టీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

ప్రస్తుతం దేశం మొత్తం రాష్ట్రపతి ఎన్నికపైనే దృష్టిసారించడంతో పార్టీ ప్రకటన ఇప్పుడు సరికాదన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్ష కూటమి అభ్యర్థి అయిన యశ్వంత్ సిన్హాకే ఓటు వేయాలని ఇప్పటికే నిర్ణయించిన కేసీఆర్.. పార్టీ నేతలతో చర్చించిన తర్వాత అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు, కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో కేసీఆర్ ప్రస్తుతం దేశంలోని ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. గురువారం ఢిల్లీకి చెందిన ఆర్థిక నిపుణులతో ప్రగతి భవన్‌లో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. నిన్న జాతీయ మీడియా ప్రముఖులతో చర్చలు జరిపారు. వచ్చే నెల రెండో వారం వరకు కేసీఆర్ ఈ చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది.

జాతీయ పార్టీ పై కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు . దేశంలో నిష్ణాతులైన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ విధివిధానాలపై వారితో సమీక్షిస్తున్నారు.పార్టీ ఎలా ఉండాలి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు . మన ప్రణాళిక ఏ విధంగా ఉండాలి. పార్టీ ప్రజలను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలు,పంచ్ డైలాగులు … నినాదాలు మొదలగు అంశాలపై లోతుగా అధ్యనం చేస్తున్నారు . ప్రధానంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలను తీసుకుంటున్నారు. విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ ఇతర రంగాలకు చెందిన ఉద్యోగుల తోనూ సమావేశమవుతున్నారు. వివిధ రంగాల్లో నిపుణులైన వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు .భారీ నీటి ప్రాజెక్ట్ లు , విద్యుత్ వాడకం అవకాశం ఉన్న ప్రాజక్టులు లాంటి సమస్యలపై సమగ్రమైన నివేదికను తయారు చేయిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో ఉన్న సమస్యలు , ప్రజలెదుర్కుంటున్న సమస్యలు , వారి భావాలూ ,పై స్టడీ చేస్తున్నారు . పార్టీకి జాతీయస్థాయి దృక్పధం ఉండాలి కాబట్టి సర్వే జనః సుఖినోభవంతు అనేలా పార్టీని అన్ని ప్రాంతాలు , అన్ని వర్గాలు , అన్ని మతాలు ఆదరించి అక్కున చేర్చుచుకునేట్లుగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు …పార్టీ పేరు ఇంకా ప్రకటించినప్పటికీ భారతీయ రాష్ట్ర సమితి అని పేరు పెట్టాలని నిర్ణయించినట్లు వార్త కథనాల సారాంశం .. అందువల్ల కేసీఆర్ పార్టీ ఏర్పాటుపై మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి !

Related posts

ఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ.. 

Drukpadam

నా వ్యాఖ్యలను వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది: మల్లికార్జున ఖర్గే

Drukpadam

నాకు, జగ్గారెడ్డికి మధ్య ఉన్నది తోడికోడళ్ల పంచాయితీనే: రేవంత్ రెడ్డి!

Drukpadam

Leave a Comment