Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రతరం..

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రతరం.. పాఠ్యపుస్తకాలు కూడా ముద్రించలేని స్థితిలో ప్రభుత్వం
-పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండవన్న పాక్ పేపర్ అసోసియేషన్
-సింధ్, పంజాబ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా బోర్డులదీ అదే పరిస్థితి
-దేశంలో పేపర్ ఖరీదైన వస్తువుగా మారిందన్న ఆర్థికవేత్త డాక్టర్ ఖైజర్ బెంగాలీ

మన దిగువన ఉన్న శ్రీలంకలో ఆర్థికసంక్షోభంతో అక్కడ ప్రజలు అల్లాడుతుండగానే పక్కనే ఉన్న మన దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థికసంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. డబ్బులు ఉన్న వస్తువులు దొరకని పరిస్థితి నెలకొన్నది ప్రధానంగా స్కూల్స్ తెరిచే సీజన్ ప్రారంభమైంది. అలాంటిది పుస్తకాలూ ముద్రించిందేకు పేపర్ కొరత ఏర్పడింది. బంగారంకన్నా పేపర్ దొరకటం కష్టంగా మారింది. దీంతో అనేక రాష్ట్రాలలో పుస్తకాలు ముద్రించలేక చేతులెత్తేశారు .

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న పాకిస్థాన్ పాఠ్యపుస్తకాలను కూడా ముద్రించలేని స్థితికి దిగజారిందని బెంబేలు ఎత్తుతున్నారు . కాగితం కొరత కారణంగా ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండవని పాకిస్థాన్ పేపర్ అసోసియేషన్ హెచ్చరించింది. సింధ్, పంజాబ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా బోర్డులు కూడా పుస్తకాలు ముద్రించలేదు.

పేపర్ సంక్షోభం కారణంగా ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉండవని ఆల్ పాకిస్థాన్ పేపర్‌ మర్చంట్ అసోసియేషన్, పాకిస్థాన్ అసోసియేషన్ ఆఫ్ ప్రింటింగ్ గ్రాఫిక్ ఆర్ట్ ఇండస్ట్రీ (PAPGAI)తోపాటు ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ ఖైజర్ బెంగాలీ పేర్కొన్నారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలో పేపర్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, పేపర్ చాలా ఖరీదైన వస్తువుగా మారిపోయిందని బెంగాలీ పేర్కొన్నారు. ఇది ఇతర రంగాల మీద కూడా పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

రైతు ఉద్యమం నుండి మోడీ తప్పించుకోలేరు- డాక్టర్ ఆశిష్ మిట్టల్

Drukpadam

Photo Exhibit Puts Talents, Emotion On Display

Drukpadam

ఎట్టకేలకు తెలంగాణలోని వర్సిటీలకు నూతన వీసీలు!

Drukpadam

Leave a Comment