షిండే కొత్త పార్టీ …పేరు శివసేన బాలథాకరే!

షిండే కొత్త పార్టీ …పేరు శివసేన బాలథాకరే!
-అభ్యంతరం చెప్పిన శివసేన చీఫ్ ..
-ఉద్ధవ్ థాకరేకు షాక్.. కొత్త పార్టీని ప్రకటించిన శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు
-తమ గ్రూపుకు శివసేన బాలాసాహెబ్ పేరు పెట్టినట్టు ప్రకటన
-ఇకపై తమ గ్రూపు ఇదే పేరుతో పిలవబడుతుందని వ్యాఖ్య
-రెబెల్స్ శివసేన గూటికి చేరే అవకాశాలు లేనట్టే

శివసేన రెబల్ ఎమ్మెల్యేలు కొత్తపార్టీ ప్రకటించారు . పేరు శివసేన బాలథాకరే పార్టీ అని నామకరణ చేశారు . దానిపై శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే అభ్యంతరం వ్యక్తం చేశారు . బాలథాకరే పేరును ఉపయోగించరాదని స్పష్టం చేశారు . అయినప్పటికీ బాలథాకరే కు నిజమైన వారసులం తామేనని వారు ప్రకటించారు .

శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వడంపై పార్టీ నాయకత్వం కొత్త ఆలోచనలో పడింది. ఏక్ నాథ్ షిండే నాయకత్వం వహిస్తున్న రెబెల్ ఎమ్మెల్యేలు కొత్త పార్టీని ప్రకటించారు. తమ గ్రూపుకు ‘శివసేన బాలాసాహెబ్’ అనే పేరు పెట్టినట్టు రెబెల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్కార్ తెలిపారు.

ఇప్పటి నుంచి తమ గ్రూపు శివసేన బాలాసాహెబ్ పేరుతో పిలవబడుతుందని ఆయన తెలిపారు. ఏ పార్టీలో కూడా తాము కలవబోమని చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో, రెబెల్ ఎమ్మెల్యేలు ఇక శివసేన గూటికి చేరే అవకాశాలు లేవనే విషయం అర్థమవుతోంది.

Leave a Reply

%d bloggers like this: