దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్ లో చెల్లాచెదురుగా మృతదేహాలు…

దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్ లో చెల్లాచెదురుగా మృతదేహాలు… ఎలా చనిపోయారన్నది మిస్టరీ!

-ఈస్ట్ లండన్ సిటీలో ఘటన
-ఆదివారం వేకువ జామున ఘటన
-మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేని వైనం
-కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులు

దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్ లో 17 మృతదేహాలు పడివుండడం తీవ్ర కలకలం రేపింది. ఈస్ట్ లండన్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మృతదేహాలన్నీ చెల్లా చెదురుగా క్లబ్ లోని వివిధ ప్రదేశాల్లో పడి ఉండగా, మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేదు. దాంతో వారు ఎలా చనిపోయారన్నది మిస్టరీగా మారింది. ఈస్ట్ లండన్ లోని సీనరీ పార్క్ లో ఈ నైట్ క్లబ్ ఉంది. ఆదివారం వేకువజామున మృతదేహాల సంగతి బయటికి పొక్కడంతో తీవ్ర కలకలం చెలరేగింది.

పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నించారు. దీనిపై ఓ పోలీసు అధికారి స్పందిస్తూ, తాము పుకార్లను నమ్మదలుచుకోలేదని, ఇంతమంది ఎలా మరణించారన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. కాగా, మృతదేహాల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయితే వారి మరణానికి నిర్దిష్ట కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

%d bloggers like this: