ఖమ్మం లో కారు దిగుతున్న నేతలు …అధిష్టానం గుస్సా !

ఖమ్మం లో కారు దిగుతున్న నేతలు …అధిష్టానం గుస్సా !
నిన్న తాటి మరో జడ్పీటీసీ …నేడు రామ్మూర్తి నాయక్ దంపతులు
మరికొందరు కారు దిగేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం
అందులో కొందరు ముఖ్యనేతలు , ప్రజాప్రతినిధులు పై ఇంటలిజెన్స్ నిఘా

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిన్నటివరకు అత్యంత బలమైన పార్టీగా ఉందని భావిస్తున్న తరుణం లో అందులోని నేతలు ఒక్కరుగా కారు దిగుతున్నారు … దీంతో స్థానికి నాయకత్వం పై అధిష్టానం గుస్సాగా ఉన్నట్లు తెలుస్తుంది. జిల్లాలో 4 గురు ఎంపీలు , 7 గురు ఎమ్మెల్యేలు , ఒక ఎమ్మెల్సీ , ఒక మంత్రి , స్థానికసంస్థల ప్రతినిధులు , అనేక మంది ఉన్నారు . ఒకరకంగా చెప్పాలంటే గతంలో ఏ పార్టీకి లేని విధంగా టీఆర్ యస్ కు జిల్లా లో అధికార బలం ఉంది. అయినప్పటికీ
పార్టీ లో ఐక్యత లోపించింది… సమన్వయము కొండెక్కింది. దీంతో ఇటీవల ఖమ్మం వచ్చిన కేటీఆర్ ఖమ్మం నేతలను అందరిని పార్టీ కార్యాలయానికి పిలిచి నేతల మధ్య ఐక్యత ఉండాలని , అందుకు సమన్వయము అవసరమని చెప్పారు . సమన్వయకర్తగా జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు భాద్యతలు అప్పగించారు . మరో సరి కలుద్దామని కేటీఆర్ అన్నారు . జిల్లాపై ద్రుష్టి సారించిన కేటీఆర్ మరో సమావేశం జరపాల్సివుండగా నాయకులూ కారు దిగటంపై ఆందోళన వ్యక్తం అవుతుంది. మరికొందరు నేతలు సైతం కారు దిగేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం . అందులో జిల్లాకు చెందిన ముఖ్యనేతలతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు సైతం పక్క చూపులు చూస్తున్నారని అంటున్నారు .

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీఆర్ యస్ నేత తాటి వెంకటేశ్వర్లు పార్టీ తిరుగుబాటు చేసి మీడియా సమావేశంలో విమర్శలు గుప్పించి మరుసటి రోజు హైద్రాబాద్ గాంధీ భవన్ కు వెళ్లి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేరు . పినపాక నియోజకవర్గానికి చెందిన మరో జడ్పీటీసీ సైతం కాంగ్రెస్ లో చేరారు . నేడు పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలానికి చెందిన రామ్మూర్తి నాయక్ ,ఆయన భార్య మాజీ జడ్పీటీసీ తోపాటు సుమారు రెండువందల కార్లతో నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి రాయల నాగేశ్వరరావు ఆధ్వరంలో హైద్రాబాద్ గాంధీ భవన్ కు వెళ్లి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు . ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి కూడా పాల్గొన్నారు .
అనేకమంది పార్టీపై అలకబూనారు .

Leave a Reply

%d bloggers like this: