Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జూలై 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ….

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జులై 18 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయని లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. జులై 18 నుంచి ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని స్పష్టంచేసింది. మరోవైపు, పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే (జులై 18)న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా.. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
ఇదిలా ఉండగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ప్రారంభమై, ఆగస్టు 12 వరకూ కొనసాగించాలని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీపీఏ) తేదీలను ఇటీవల ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఆ ప్రతిపాదనకు అనుగుణంగానే సమావేశాల తేదీలను ఖరారు చేశారు. ప్రస్తుత పార్లమెంటు భవనంలో జరిగే చిట్టచివరి సమావేశాలు కూడా ఇవేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 2022 శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు.

Related posts

ప‌ద్మావ‌తి నిల‌యంలోనే శ్రీ బాలాజీ క‌లెక్ట‌రేట్‌..సుప్రీంకోర్టు

Drukpadam

నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. 91,142 ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌..

Drukpadam

బద్ధకం.. పొగతాగడంకన్నా డేంజరట!

Drukpadam

Leave a Comment