హైద్రాబాద్ లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు ఘనస్వాగతం

హైదరాబాద్ చేరుకున్న యశ్వంత్ సిన్హా …

ఘన స్వాగతం పలికిన కేసీఆర్ … పది వేల బైకులతో భారీ ర్యాలీ

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. సిన్హాకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వగతం పలికారు. కేసీఆర్ తో పాటు కెటీఆర్ పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్వాగతం పలికిన వారిలో వున్నారు. అనంతరం భారీ ర్యాలీగా జలవిహార్ చేరుకున్నారు. ఈ ర్యాలీలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు పది వేల బైకులతో పాల్గొన్నారు. కేసీఆర్ కాన్వాయ్ కూడా ర్యాలీలో కొనసాగింది. ర్యాలీ సాగే ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, గులాభి జెండాలతో శోభాయమానంగా అలంకరించారు. సమావేశం జరిగే జలవిహార్ ప్రాంతమంతా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కోలాహలంగా మారింది

Leave a Reply

%d bloggers like this: