పోలీసుల వేధింపులు సరికాదు…చంద్రబాబు

పోలీసుల వేధింపులు సరి కాదు …

  • సుప్రీం తీర్పుకు వ్యతిరేకమన్న చంద్రబాబు
  • చర్యలకై ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డికి లేఖ

వివిధ అంశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని పోలీసులు వేధించడాన్ని తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడు ఖండించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. దీనిపై ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డికి చంద్రబాబు ఓ లేఖ రాసారు.
సీఐడీ అధికారులు గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని.. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి అదుపులోకి తీసుకోవడం ఏమిటని డీజీపీకి రాసిన లేఖలో ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని నోటీసుల పేరుతో వేధించడం సరికాదని.. ఇది సుప్రీం తీర్పుకు విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వమే కావాలని ప్రతిక్షాలను రాజకీయంగా వేధిస్తోందని.. ఈ కుట్రకు సహకరిస్తున్న సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Leave a Reply

%d bloggers like this: