Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బిజెపిలో చేరికలు ప్రోత్సహిస్తాం : కొండా విశ్వేశ్వర్ రెడ్డి!

బీజేపీలోకి నెలకు ఒక నేతను తీసుకొస్తా..: కొండా విశ్వేశ్వర్ రెడ్డి!

  • సీఎం కేసీఆర్ ను అడ్డుకోవడం ఒక్క బీజేపీకే సాధ్యమన్న కొండా 
  • బీజేపీ చేరికల కమిటీ సభ్యుడిగా నియమించి తనకు ప్రాధాన్యమిచ్చారని వ్యాఖ్య 

బిజెపిలో చేరికలు ప్రోత్సహిస్తాం 
-నెలకొక నాయకుడిని తీసుకొస్తా
-టిఆర్ఎస్ ను ఎదుర్కోవటం ఒక బీజేపీ కే సాధ్యం
– తాను బీజేపీలో చేరుతున్న విషయం కాంగ్రెస్ నాయకులకు ముందే తెలుసు
-అయినప్పటికీ తననెవరూ సంప్రదించలేదని

 

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపిలో అధికారికంగా చేరారు గత కొద్దికాలంగా బీజేపీ లో చేరేందుకు ముగ్గుచూపుతున్నప్పటికీ కాంగ్రెస్ నాయకుల్లో ప్రధానంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లోవిశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారనే నమ్మకం ఉంది. కానీ వారి ఆశలను అడియాశలు చేస్తూ ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు . చేరిన వెంటనే ఆయన్ను చేరికల కమిటీలు సభ్యులుగా నియమించారు ప్రాధాన్యం కల్పించారు . దీంతో ఆయన కెసిఆర్ ను ఓడించటమే తన ధ్యేయమని అందుకు ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా అక్కడ ఉంటాను భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ లో చేరిక తన అభిప్రాయాలను వెల్లడించారు. కేవలం టిఆర్ఎస్ను ఎదుర్కునేందుకు తాను బిజెపిలో చేరినట్లు విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. టిఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్కు లేదని అది ఒక బిజెపికే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసమే తాను బీజేపీలో చేరానని తెలిపారు .

తెలంగాణలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును అడ్డుకోవడం ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ లో కాళ్లు మొక్కించుకోవడం, డబ్బులు తీసుకోవడం, కేసులతో బెదిరించడం తప్ప ఏమీ లేదని విమర్శించారు. ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుందంటే తాను అక్కడే ఉంటానని.. అందుకే బీజేపీలో చేరానని చెప్పారు.

ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీలో ఆయనకు తగిన ప్రాధాన్యమిస్తూ.. పార్టీ చేరికల సమన్వయ కమిటీలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని సభ్యుడిగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఇన్నాళ్లూ తటస్థంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు..  
తాను బీజేపీలో చేరుతున్న విషయం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలందరికీ తెలుసని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. తాను ఇన్ని రోజులు తటస్థంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని.. ఇప్పుడు బీజేపీలో చేరే సరికి అంతా అడుగుతున్నారని తెలిపారు. బీజేపీలో తనకు ప్రాధాన్యత ఇచ్చి చేరికల కమిటీలో అవకాశమిచ్చారని.. నెలకు ఒక్క నేతను అయినా బీజేపీలోకి తీసుకొస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు.

I will bring atleast one leader into BJP every month says Konda Vishweshwar Reddy

Related posts

కేసీఆరే అధ్యక్షుడు …కేటీఆర్ మరికొద్ది కాలం ఆగాల్సిందే -రంగంలోకి దిగిన మంత్రులు!

Drukpadam

కడియం శ్రీహరీ… తస్మాత్ జాగ్రత్త!: హెచ్చరించిన ఎమ్మెల్యే రాజయ్య…

Drukpadam

ఇకపై కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు: పెద్దిరెడ్డి!

Drukpadam

Leave a Comment