రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మోదీకి జగన్ మద్దతు ఇస్తున్నారు: శైలజానాథ్

  • 25 మంది ఎంపీలను ఇస్తే స్పెషల్ స్టేటస్ తెస్తానని జగన్ అన్నారన్న శైలజానాథ్
  • రాష్ట్ర ప్రయోజనాలను మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపణ
  • ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్థికి వ్యతిరేకంగా టీడీపీ, వైసీపీలు ఓటు వేయాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ కి ద్రోహం చేస్తున్న ప్రధాని మోదీకి, బీజేపీకి ముఖ్యమంత్రి జగన్ మద్దతిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానంటూ జగన్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మోదీ కాళ్ల దగ్గర ప్రత్యేక హోదా, విభజన హామీలను జగన్ తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. 

అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన చెప్పారు. హోదా సాధించడం కోసం వైసీపీ ఎమ్మెల్యేలను సైతం కలిసి, వారి మద్దతు కోరుతామని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వ్యతరేకంగా టీడీపీ, వైసీపీలు ఓటు వేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి స్పెషల్ స్టేటస్, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

%d bloggers like this: