తరగతి గదిలో విద్యార్థికి లవ్ ప్రొపోజ్ చేసిన ఉపాధ్యాయుడు ….

తరగతి గదిలో మోకాళ్లపై కూర్చుని విద్యార్థినికి పువ్వుతో లవ్ ప్రపోజల్.. ఊడిన ఉద్యోగం!

  • అసోంలోని ధామాజీ పట్టణంలో ఘటన
  • విద్యార్థినిపై మనసు పారేసుకున్న ఉపాధ్యాయుడు
  • తరగతి గదిలో లవ్ ప్రపోజల్ వీడియో వైరల్
  • ఉపాధ్యాయుడు, విద్యార్థినిపై వేటు

ఈ ప్రపంచం మొత్తం ప్రేమమయమే. ఎవరు ఎప్పుడు, ఎవరితో ప్రేమలో పడతారో ఊహించడం కష్టం. మనలో ప్రేమ భావం మొలకెత్తినప్పుడు దానిని అణచుకోకుండా వ్యక్తీకరించడమే మంచిది. అయితే, దానికి తగిన సమయం, సందర్భం కూడా ఉండాలి. లేకపోతే ఈ ఉపాధ్యాయుడిలా ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది. అసోంలోని ధామాజీ పట్టణానికి చెందిన మనోజ్ కుంబంగ్.. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్య యోజన ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థినిపై మనసు పారేసుకున్నాడు.

తన ప్రేమను వెల్లడించేందుకు సమయం కోసం ఎదురుచూస్తున్న మనోజ్ వన్ ఫైన్ డే తరగతి గదిలోనే సినిమాటిక్‌‌గా తన లవ్‌ను ప్రపోజ్ చేశాడు. చేతిలో పువ్వు పట్టుకుని మోకాళ్లపై కూర్చుని అమ్మాయి ఎదుట తన ప్రేమను బయటపెట్టాడు. ఈ దృశ్యాన్ని క్లాస్ రూంలోని మిగతా విద్యార్థులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

మనోజ్ ప్రతిపాదనకు అమ్మాయి నుంచి ఎలాంటి రిప్లై వచ్చిందో తెలియదు కానీ, ఈ వీడియో వైరల్ కావడంతో అతడి ఉద్యోగం ఊడింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు మనోజ్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. అలాగే, ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు. వీడియో తీసిన విద్యార్థులపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Teacher of rural youth training center sacked for proposing student in Assam

Leave a Reply

%d bloggers like this: