వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేస్తా: ఈటల రాజేందర్ సంచలన ప్రకటన!

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేస్తా: ఈటల రాజేందర్ సంచలన ప్రకటన!
వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానన్న ఈటల
ఇప్పటికే గజ్వేల్ లో గ్రౌండ్ వర్క్ చేస్తున్నానని వెల్లడి
బెంగాల్ మాదిరి ఇక్కడ కూడా సీఎంను ఓడించాలని పిలుపు
బెంగాల్ లాగా తెలంగాణ రిపీట్ అవుతుందా ?

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ నుంచి పోటీచేస్తానని సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని, కేసీఆర్ ను ఢీకొంటానని చెప్పారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి ముందే చెప్పానని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్నానని అన్నారు. కేసీఆర్ ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. పశ్చిమబెంగాల్ సీన్ తెలంగాణలో రిపీట్ అవుతుందని అన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ నేత సువేందు అధికారి ఓడించారని… పశ్చిమబెంగాల్ మాదిరే ఇక్కడ కూడా ముఖ్యమంత్రిని ఓడించాలని చెప్పారు.

అయితే ముఖ్యమంత్రి ఓడిపోయినా అధికారం మమతా దక్కించుకున్న విషయాన్నీ ఈటల విస్మరించారు . బీజేపీ హోరాహోరీగా పోరాడిన అధికారానికి అందనంత దూరంలో ఉంది. సీఎం మమతా తన స్వంత నియోజకవర్గం కాకుండా టీఎంసీ నుంచి బీజేపీలోకి పిరాయించిన సువెందు అధికారి పై పోటీచేసి అతికొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు .అయినప్పటికీ ఆమె పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది. అందువల్ల బెంగాల్ లాగా అంటే ఒకవేళ కేసీఆర్ ఓడిపోయినా ఆపార్టీ అధికారంలోకి వచ్చిన విషయం బీజేపీ మరిచి పోతుంది . బెంగాల్ లాగా అంటే కుదరదని ఈటల తెలుసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Leave a Reply

%d bloggers like this: