Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సామాన్య గిరిజన మహిళకు అత్యన్నత రాష్ట్రపతి కిరీటం!

సామాన్య గిరిజన మహిళకు అత్యన్నత రాష్ట్రపతి కిరీటం!
-పార్లమెంట్ సభ్యుల ఓట్ల లెక్కింపు పూర్తి
-ముర్ముకు 540 సభ్యుల ఓట్లు …వాటి విలువ 378000
-యస్వంత్ సిన్హా కు 208 ఓట్లు వాటి విలువ 145600
-ఓట్లు చెల్లకుండా వేసిన ఎంపీ లు 15 మంది

దేశ అత్యన్నత పదవిని ఒక సామాన్య గిరిజన మహిళ అలంకరించి బోతుంది. ..గిరిజనులు కూడా ఎప్పుడు ఉహించి ఉండరు… తమ జాతికి చెందిన వారికీ …అందులో మహిళకు… భారత దేశ రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించే అవకాశం వస్తుందని కానీ అది జరిగింది. అందుకే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రపంచంలో గొప్ప పేరుంది. చాలామంది అందుకే దట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని అంటుంటారు . మధ్యాన్నం వరకు పార్లమెంట్ ఉభయ సభలోని ఓట్లను లెక్కించారు . మొత్తం 788 ఓట్లు ఉండగా అందులో 763 ఓట్లు పోలయ్యాయి . పోలైన ఓట్లలో 15 మంది ఓట్లు చెల్లలేదు .748 మంది ఎంపీల ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. వాటిలో ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు 540 మంది సభ్యులు ఓట్లు వేయగా విపక్షాల అభ్యర్థిగా పోటీచేసిన యస్వంత్ సిన్హా కు కేవలం 208 ఓట్లు మాత్రమే ఓట్లు వచ్చాయి. ముర్ము ఓట్లు విలువ 378000 కాగా , సిన్హా కు వచ్చిన ఓట్ల విలువ 145600 లు దీంతో ముర్ము గెలుపు ఖాయమైనట్లేనని తెలుసుతుంది.

పార్లమెంట్ సభ్యుల ఓట్ల లెక్కింపు తరువాత వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యుల ఓట్లను లెక్కిస్తున్నారు . ఫలితం ఈ సాయంత్రానికి ప్రకటిస్తారు . ఇప్పటికే ముర్ము గెలుపు ఖాయమనే సంకేతాలు వెలువడటంతో ఆమె స్వగ్రామంలో సభారాలు ప్రారంభం అయ్యాయి. దేశవ్యాపితంగా సంబరాలకు సన్నధం అవుతున్నారు . ప్రత్యేకించి స్వరాష్ట్రం ఒడిశా లో సంబరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు . అనేక మంది ప్రముఖులు ముర్ము కు అభినందనలు తెలుపుతున్నారు .ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి కావడంపై దేశ విదేశాల్లో హర్షతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. స్కూల్ టీచర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన ముర్ము ఒడిశా శాశనసభలో ఎమ్మెల్యే గా , మంత్రిగా తరువాత గవర్నర్ గా వివిధ పదవులు చేపట్టి పదవులన్నిటికి వన్నె తెచ్చారు . అందుకే రాష్ట్రపతి పదవికి ఎవరు అనుకున్నప్పుడు అనేక పేర్లు వినిపించినప్పటికీ ప్రధాని మోడీ బీజేపీ నాయకత్వం మరో మాటకు తావు లేకుండా ముర్ము వైపు మొగ్గు చూపింది.

ఎంపీల ఓట్లు సైతం చెల్లలేదు …

రాష్ట్రపతి ఎన్నికల్లో అందరికి ఓట్లు ఉండవు …రాష్ట్రపతికి ఓటు వేయడం అంటేనే ఒక మంచి అవకాశం వచ్చిన అవకాశాన్ని అందులో ఎంపీలుగా ఎన్నికైన వారు వేసిన ఓట్లు చెల్లకపోవడం గమనార్హం .. అలంటి వారికీ ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తున్నారు . తమకు నచ్చిన అభ్యర్థికి ఓట్లు వేయడంలో తప్పులు చేసే వారు కూడా ఎంపీలు గా ఇంకా ఉన్నారంటే ఆశ్చర్యమే మరి !

Related posts

రెండు డోసుల వ్యాక్సిన్ తర్వాత కూడా ఇంట్లోనే ఉండమంటే ప్రయోజనం ఏమిటి?: బాంబే హైకోర్టు సూటి ప్రశ్న ….

Drukpadam

కెన్యాలో పాకిస్థాన్ జర్నలిస్ట్ అర్షద్ షరీఫ్ కాల్చివేత!

Drukpadam

ఓపెనింగ్ కు సిద్ధమవుతున్న తెలంగాణ సెక్రటేరియట్.. !

Drukpadam

Leave a Comment