Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా వంతు …రేపే విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు …

జ‌మ్ము క‌శ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు!

  • రేపు విచార‌ణ‌కు రావాలంటూ ఆదేశం
  • మ‌నీ ల్యాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై ఫ‌రూక్‌పై కేసు
  • సోనియాను విచారిస్తున్న రోజే ఫ‌రూక్‌కు ఈడీ నోటీసులు
జ‌మ్ము క‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ అధినేత ఫ‌రూక్ అబ్దుల్లాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) సోమ‌వానం స‌మ‌న్లు జారీ చేసింది. ఈ నెల 27న (బుధ‌వారం) త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ స‌ద‌రు నోటీసుల్లో అబ్దుల్లాను ఈడీ అధికారులు కోరారు. మ‌నీ ల్యాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన కేసులో అబ్దుల్లాపై కేసు న‌మోదు చేసిన ఈడీ…తాజాగా ఆయ‌న‌ను విచార‌ణ‌కు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారిస్తున్న రోజే ఫ‌రూక్ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.
ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా వంతు .. ఈ డి కేసులు రాజకీయ నేతలపై పెడుతున్న సంగతి తెలిసిందే. తమకు కొరకరాని కొయ్య గా ఉన్నరాజకీయ నేతలపై కేసులు పెట్టడం వారి వేధించడం ఆనవాయితీగా మారిందనే విమర్శలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ చేసిన తప్పులనే ఇప్పుడు బీజేపీ చేస్తుందనే విమర్శలు ఉన్నాయి . తమ ప్రత్యర్థులను గిట్టనివారిని వేదించడంలో వారు వీరు ఒకటే అనే అభిప్రాయాలు ఉన్నాయి.ఈడీని పాలక పార్టీ రాజకీయాల కోసం దుర్వినియోగం చేస్తుందని విమర్శలు ఉన్నాయి . ప్రస్తుతం వీడి కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైన వేనని అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ ప్రశ్నిస్తూ ఉండగా దేశంలో మరో ముఖ్య నేత జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అబ్దుల్లాకు ఫరూక్ అబ్దుల్లా కు ఈడీ నోటీసులు అందజేయటం గమనార్హం. ఆయన్ను రేపే ఈడి ఎదుట విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ నేతలు ఖంగుతిన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలైన సోనియా గాంధీని రాహుల్ గాంధీ విచారిస్తూ గంటలకొద్దీ వారిని కార్యాలయంలో ఉంచటం దానికి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లు చర్చనీయాంశమైన తరుణంలో మరో ముఖ్య నేత నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ తాకీదు పంపడం ఆసక్తికర పరిణామంగా మారింది. అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఈ డి ఇలా రాజకీయ నాయకులకు నోటీసులు పంపిస్తుంది అనే అంశాన్ని పరిశీలిస్తే గతంలో కూడా పాలక పార్టీలు ఇదే విధానాన్ని అవలంబించాలని అంటున్నారు విశ్లేషకులు . గతంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సిబిఐ దాడులు కేసులు ఈ కోవలోకే వస్తాయని అంటున్నారు. ఈడీ అనేకమంది నోటీసులు పంపింది. ఎన్సీపీ నేత శరద్ పవార్ శివసేన ఎంపీ అజయ్ రౌత్ తదితరులు ఈడీ నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ నాయకులపై కూడా సిబిఐ ఈడి నోటీసులు పంపటం దాడులు చేయటం లాంటి చర్యలకు పూనుకునే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు బయలుదేరాయు . టిఆర్ఎస్ లో ముఖ్య నేతలను టార్గెట్ గా ఈ చర్యల ద్వారా టిఆర్ఎస్ ను బలహీనపరిచి తాము బలపడాలని బిజెపి భావిస్తోంది అందులో భాగంగానే రాజ్యాంగపరమైన వ్యవస్థలను ఉపయోగించాలని చూస్తుందని పరిశీలకుల అభిప్రాయం …
ed summons to jammu and kashmir ex cm rafooq abdullah

Related posts

10 నెలలుగా జీతాలులేని ప్రభుత్వహాస్పిటల్ అవుట్ సోర్సింగ్ కార్మికులు

Drukpadam

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇక చెప్పేదేమీ లేదు….కేంద్రం !

Drukpadam

అప్పుల్లో కాంగ్రెస్ …ఆస్తుల్లో బీజేపీ టాప్ …

Drukpadam

Leave a Comment