Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ సీఎం జ‌గ‌న్‌తో ఎంపీ మార్గాని భ‌ర‌త్ తండ్రి భేటీ!..!

ఏపీ సీఎం జ‌గ‌న్‌తో ఎంపీ మార్గాని భ‌ర‌త్ తండ్రి భేటీ!..!

  • ఉభ‌య రాష్ట్రాల బీసీ సంఘాల స‌మైక్య క‌న్వీన‌ర్‌గా నాగేశ్వ‌ర‌రావు
  • ప్ర‌జారాజ్యంలో కీల‌క భూమిక పోషించిన బీసీ నేత‌
  • 2009లో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ టికెట్‌ను ఆశించిన  వైనం
  • టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో పార్టీకి రాజీనామా చేసిన మార్గాని

వ‌ర‌ద ప్రాంతాల ప‌రిశీల‌న కోసం ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీగా ఉన్న వైసీపీ యువ నేత మార్గాని భ‌ర‌త్ రామ్ తండ్రి మార్గాని నాగేశ్వ‌ర‌రావు భేటీ అయ్యారు. మంగ‌ళ‌వారం కోన‌సీమ జిల్లాలో ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని రాత్రికి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం చేరుకున్న జ‌గ‌న్‌… రాత్రికి అక్క‌డే బ‌స చేసిన సంగ‌తి తెలిసిందే. మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలో తన కుమారుడు మార్గాని భరత్ తో కలిసి సీఎం జగన్ కు మార్గాని నాగేశ్వరరావు స్వాగతం పలికారు. అనంతరం జగన్ తో ఆయన భేటీ అయ్యారు.

ఇప్ప‌టి త‌రం జ‌నాల‌కు మార్గాని భ‌ర‌త్ రామ్ గురించి తెలుసు గానీ… ఆయ‌న తండ్రి మార్గాని నాగేశ్వ‌ర‌రావు గురించి పెద్ద‌గా తెలియ‌ద‌నే చెప్పాలి. బీసీ కులాల అభ్యున్న‌తి కోసం భారీ ఉద్య‌మాలు న‌డిపిన నాగేశ్వ‌ర‌రావు ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌ బీసీ సంఘాల స‌మైక్య క‌న్వీన‌ర్‌గా కొన‌సాగుతున్నారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంతో పాటు ఉమ్మ‌డి తూర్పు గోదావరి జిల్లాలో నాగేశ్వ‌ర‌రావుకు ప‌రిచ‌యం అక్క‌ర్లేద‌నే చెప్పాలి. జిల్లావ్యాప్తంగా ఆయ‌న‌కు అనుచ‌రులు ఉన్నారు.

ఇక రాజ‌కీయంగానూ నాగేశ్వ‌ర‌రావు కీల‌కంగానే రాణించారు. అయితే ఆయ‌న ప్ర‌జా ప్ర‌తినిధిగా మాత్రం ఎన్నిక కాలేదు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యంలో కీల‌క భూమిక పోషించిన నాగేశ్వ‌ర‌రావు.. పార్టీ ఆర్గ‌నైజింగ్ క‌మిటీ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న శ్రీకాకుళం జిల్లా పార్టీ వ్య‌వ‌హారాలు చూసేవారు. అయితే 2009 ఎన్నిక‌ల్లో రాజ‌మ‌హేంద్రవ‌రం ఎంపీ సీటును ఆయ‌న ఆశించ‌గా…చిరంజీవి మాత్రం ఆయ‌న‌కు టికెట్ నిరాక‌రించారు.

ఆశించిన టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన నాగేశ్వ‌ర‌రావు… యువ రాజ్యంలో కీల‌కంగా ఉన్న త‌న కుమారుడు మార్గాని భ‌ర‌త్‌తో క‌లిసి ప్ర‌జారాజ్యానికి రాజీనామా చేశారు. బీసీల‌కు ప్ర‌జా రాజ్యం పార్టీలో త‌గిన గుర్తింపు ద‌క్క‌లేద‌ని ఆయ‌న బ‌హాటంగానే వ్యాఖ్యానించారు. ప్ర‌జా రాజ్యంలో ఎదురైన అనుభ‌వంతో నాగేశ్వ‌ర‌రావు రాజ‌కీయాల‌పై ఆస‌క్తి త‌గ్గించారు. తాను తెర వెనుక నిలిచి త‌న కుమారుడు భ‌ర‌త్‌ను మాత్రం వైసీపీలోకి పంపి… రాజ‌మ‌హేంద్ర‌వ‌రం లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్య‌లో ఉన్న బీసీల ఓట్ల‌తో త‌న కుమారుడిని ఎంపీగా గెలిపించుకున్నారు.

ysrcp mp margani bharat father margani nageswara rao met ys jagan in rajamahendravaram

Related posts

భారతీయ జగన్ పార్టీగా మారిన బీజేపీ: పయ్యావుల

Drukpadam

ఆఫ్ఘన్ నుంచి అమెరికన్లను సురక్షితంగా తీసుకొస్తా పర్మిషన్ ఇవ్వండి :లాడెన్ ను హతమార్చిన మాజీ నేవీ సీల్!

Drukpadam

హుజారాబాద్ లో గెలుపే ఎజండాగా బీజేపీ సమావేశం…

Drukpadam

Leave a Comment