మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలి సీపీఎం డిమాండ్

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లాకార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం ఇద్దరు కార్మికులు బలి

నిర్లక్ష్యం వహించిన కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి.

మృతి చెందిన కార్మికుల కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలి.

  • విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు

ఖమ్మం, ఆగస్ట్ 13 (శనివారం):- మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం ఇద్దరు మున్సిపల్‌ కార్మికులు నిండు ప్రాణాలు బలితీసుకుందని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు ఆరోపించారు. శనివారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం వలన మున్సిపల్‌ కార్మికులు బలి అయ్యారని, అంతకు ముందు కూడా ఒక యువకుడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పైపులో ఇరుక్కుని చనిపోయాడని, శుక్రవారం ఖమ్మంలో జరిగిన ఘటన డిఆర్‌ఎఫ్‌ అని కార్మికులకు ఒక్క బోర్డు తగిలించి హైదరాబాద్ లో ప్రాధమిక శిక్షణ ఇచ్చి, వీరికి క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇవ్వకుండా, మున్సిపల్‌ కమీషనర్‌ ఆదేశాల ప్రకారం ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండా వెళ్లడం వలన వారు చనిపోయారని ఆరోపించారు. ప్రత్యేకంగా మున్సిపల్‌ కమీషనరే వీరిని పంపించారని, దీనికి పూర్తిగా అధికారులు, ప్రభుత్వం బాధ్యత వహించాలని, చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చోప్పున ఎక్స్‌గ్రైషియా చెల్లించి వారి కుటుంబాలను అదుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారుల తప్పిదం ఒక భాగం అయితే కనీసం చనిపోయిన తరువాత అధికారుల తీరు చూస్తే అమానవీయంగా ఉందన్నారు. కమీషనర్‌ ఆసుపత్రికి వెళ్ళి చనిపోయిన కుటుంబాలను పరామర్శించడంగాని, ఓదార్చడంగాని చేయలేదని, కమీషనర్‌ రాకుండా ఆర్‌ డి ఓ, ఎంఆర్‌వో, ఉఫ్ర్యాటి కమీషనర్‌లను పంపించారని కాని వీరికి ఎటువంటి అధికారాలు లేవని, అలాంటి వారు వచ్చి ఏమి చేస్తారని ఇలా బాధ్యతారహితంగా వ్వవహరించిన కమీషనర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఇంత జరుగుతున్నా మంత్రులు అజయ్‌కుమార్‌, కేటిఆర్‌, ప్రజా ప్రతినిధులు కాని మేయర్‌, కార్పోరేటర్లు గాని స్పందిచకపోవడం దారుణమన్నారు. తాను స్వయంగా కమీషనర్‌, మంత్రులు అజయ్‌ కుమార్‌, కేటీఆర్‌లకు ఫోన్‌ చేసినా స్పందించలేదన్నారు. ఆసుపత్రి ఎదుట సీపీఎం, వామపక్షాలు, ఇతర పార్టీలు, కార్మిక సంఘాలు ఆందోళన చేస్తూ ఆదుకోవాలంటే రూ. 2 లక్షలు, 3 లక్షలు ఇస్తామని బేరసారాలు ఆడుతున్నారని, కార్మికుల కుటుంబాలను ఆదుకుందామని ఎవరూ ఆలోచన చేయడంలేదని అన్నారు. కార్మికుల ప్రాణాలు అంటే ఎవరికి లేక్కలేదని, చివరకి ఆందోళన కారణంగా నిబంధనల ప్రకారం రూ. 5 లక్షలే ఇస్తామని, కార్మికులు చనిపోతే నిబంధనలు ఏమిటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు, అధికారులు కోట్లు దోచుకుంటే ఏమి లేదని, కానీ కార్మికులు చనిపోతే నిబంధనలు అని చేబుతున్నారని విమర్శించారు. ఇది దుర్మార్గమైన చర్య అని ఖండించారు. 3 నెలల క్రితం పంపు ఆపరేటర్‌ అతని డ్యూటి కాకాపోయినా అక్కడకి పనికి వెళ్ళి చనిపోతే అతనికి రూ. 5లక్షలు
ఇస్తామని చెప్పి ఇంత వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మున్సిపల్‌ కార్మికులు విధులలో చనిపోతే గ్రూపు ఇన్సూరెన్స్ చేయాలని ప్రభుత్వం మున్సిపల్‌ కౌన్సిల్‌లో తీర్మానం చేయాలన్నారు. చనిపోయిన ప్రతి కార్మికుడికి రూ. 15 లక్షలు ఇవ్వాలని, అలాంటి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ విషయంలో తమ పార్టీ కార్పోరేటర్లతో తీర్మానం చేయిస్తామని, తమ రాజకీయ అవసరాల కోసం ఎక్కడైనా ఇలాంటి సంఘనటలు జరిగితే ప్రభుత్వం పెద్ద ఎత్తున రూ.80, 40 లక్షలు ఎక్స్‌గెషియా ప్రకటిస్తుందని, కార్మికులను మాత్రం పట్టంచుకొవడంలేదని, వారు పరిహరం కోసం అడ్కుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. ఇప్పటికైన అధికారులు చనిపోయిన ప్రతి కార్మికుడికి కనీసం రూ. 15 లక్షలు పరిహరం ఇచ్చేవిధంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 15 వ తేది నుంచి కొత్త ఫించన్లు ఇస్తామని ప్రకటించారని, 2, ౩8 సంవత్సర్నల అనేక సార్లు సిపీఎం ఆధ్వర్యంలో ఫించన్లు కోసం పోరాటాలు చేశామని, అంతే ఇటివల కూడా 6 రోజుల పాటు ఫించన్స్ కోసం పోరాటాలు చేశామని, ఉద్యమాల ఫలితంగా, ఎన్నికలు వస్తున్నాయని, ప్రభుత్వం ప్రకటించిందని, ఈ ప్రభుత్వం ఉప ఎన్నికలలు వ్న్హు తప్ప వ్నగ్గాన్నలు గుర్తుండడం లేదని, గత మార్చిలోనే ఇస్తామని చేప్పి , మళ్ళీ అగష్టు వచ్చిందని, ఇప్పుడు ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారని, కొత్తగా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఎప్పటి వరకు అని నిర్ధష్టంగా జీవో విడుదల చేయలేదని, ఈనెల 15 తేది నాటికి 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఫించన్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫించన్‌ పథకం ప్రభుత్వం అవసరం వచ్చినప్పడు కాకుండా 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆటో మెటిక్‌గా అమలు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల వరసగా వర్షల వలన జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని, నష్టపోయిన రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహంచి పరిహరం చేల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు పంట నష్టపరిహారం ఇవ్వలేదని, గత ప్రభుత్వాలు ఎంతో కొంత ఇచ్చాయని ఈ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పంట నష్టం అంచనాలు వేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.విక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు
ప్రకాష్
సిపిఎం జిల్లా కార్యాలయం కార్యదర్శి, ఖమ్మం
9063779613

Leave a Reply

%d bloggers like this: