కృష్ణయ్య హత్యను ఖండిస్తున్నాం …సీపీఎం

తమ్మినేని కృష్ణయ్య హత్యను, సి.పి.ఎం. నాయకుల ఇండ్లపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం – నున్నా నాగేశ్వరరావు

సోమవారం ఉదయం తెల్ధారుపల్లిలో టి.ఆర్‌.ఎస్‌. నాయకుడు తమ్మినేని కృష్ణయ్యను కొందరు హత్య చేయడాన్ని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో ఖండిరచారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనను సాకుగా తీసుకొని దీనితో సంబంధం లేని మా పార్టీ నాయకుడు తమ్మినేని కోటేశ్వరరావుతో సహా మరికొందరు పార్టీ సభ్యుల, సానుభూతిపరుల ఇండ్లపై దాడులు చేసి విధ్వంసం సృష్టించి మహిళలను, వృద్ధులను భయభ్రాంతులకు గురిచేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిరచారు. లక్షలాది రూపాయల ఆస్తులు ధ్వంసం చేయడమే కాదు, కొందరు లూటీలకు కూడా పాల్పడ్డారని అన్నారు. 3 గం.ల పాటు అరాచక మూకలు పోలీసుల ముందే స్వైర విహారం చేసినా అదుపు చేయకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ విధ్వంసానికి కారకులైన అరాచక శక్తులపై చర్యలు తీసుకొని గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలని జిల్లా అధికారులను కోరారు.

Leave a Reply

%d bloggers like this: