గోదావరి ముంపుప్రాంతాల పర్యటనకు సీఎల్పీ బృందం

భద్రాచలం ముంపుప్రాంతాలకు సీఎల్పీ బృందం

భద్రాచలం చేరుకున్న సీఎల్పీ బృందం

అకాల వర్షాలతో ఉగ్రరూపం దాల్చి వరదలతో గోదావరి ముంచేత్తిన ప్రాంతాల పర్యటనకు గాను మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు సీతక్క కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డిలు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి చేరుకున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే శ్రీపురం వీరయ్య గారు సిఎల్పీ బృందానికి ఘనంగా స్వాగతం పలికి కాంగ్రెస్ కండువాలతో సత్కరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గోదావరి వరద ముంపు ప్రాంతాలు, కరకట్టను పరిశీలిస్తారు

సీతారామచంద్రస్వామి ఆలయంలో సిఎల్పీ బృందం పూజలు

గోదావరి వరద మంపు ప్రాంతాలు, ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరిన సీఎల్పీ బృందం మంగళవారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించారు. ఆలయ అధికారులు వేద పండితులు పూర్ణకుంభంతో కాంగ్రెస్ శాసనసభక్ష నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు పొడెం వీరయ్య, శ్రీధర్ బాబు, ,సీతక్క కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డిలకు స్వాగతం పలికారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సిఎల్పి బృందం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Leave a Reply

%d bloggers like this: