కృష్ణయ్య కుటుంబానికి వద్దిరాజు సానుభూతి ….

కృష్ణయ్య కుటుంబానికి వద్దిరాజు సానుభూతి

టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య పాశవిక హత్య పట్ల రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామంలో జరిగిన కృష్ణయ్య అంతిమ యాత్ర కు ఆయన హాజరు కావాలని అనుకున్నా.. చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడింది. కృష్ణయ్య హత్యను ఎంపీ రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సమయంలో గుండె ధైర్యం తో ఉండాలని సూచించారు. హత్యకు పాల్పడిన దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పోలీసులను కోరారు.

Leave a Reply

%d bloggers like this: