Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చీమలు చిన్నవే కానీ.. వాటి లెక్కలు పెద్దవి.. 

చీమలు చిన్నవే కానీ.. వాటి లెక్కలు పెద్దవి.. 

  • భూమ్మీద మొత్తంగా 200 కోట్ల కోట్ల చీమలు ఉన్నాయని తేల్చిన శాస్త్రవేత్తలు
  • ఉష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కువగా.. చల్లటి ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయని వెల్లడి
  • చీమలు నేలను గుల్లబరిచి మొక్కలకు మేలు చేస్తాయని వివరణ

ఏదైనా విషయాన్ని చాలా చిన్నది అని చెప్పడానికి పిపీలికంతో పోలుస్తాం. అంటే చీమతో అన్నమాట. చీమ అంటేనే చిన్నది అన్న భావన కూడా కలుగుతుంది. అయితే చీమలను తక్కువ చేసి చూడొద్దని, వాటి ప్రత్యేకత వాటిదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్నవే అయినా కొన్ని రకాల చీమలు కుడితే లబోదిబోమనాల్సిందేనని గుర్తు చేస్తున్నారు. జర్మనీలోని జులియస్‌ మాక్స్‌ మిలన్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చీమలపై పరిశోధన చేశారు. అంతర్జాతీయంగా చీమలకు సంబంధించిన సుమారు 489 పరిశోధనలను గుదిగుచ్చి ఓ ప్రత్యేక నివేదికను రూపొందించారు. అందులో భూమ్మీద చీమలకు సంబంధించిన ఆశ్చర్యకరమైన లెక్కలు చెప్పారు. వారు చెప్పిన వివరాల మేరకు..

200 కోట్ల కోట్ల చీమలు

  • భూమ్మీద మొత్తంగా దాదాపు 20 క్వాడ్రిలియన్ల చీమలు ఉన్నాయి. అంటే 20 పక్కన 15 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అన్నమాట. సింపుల్‌ గా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే 200 కోట్ల కోట్ల చీమలు ఉన్నాయి.
  • గండుచీమ, నల్లచీమ, ఎర్ర చీమ.. ఇలా చీమలు ఏవైతేనేం, ఏయే ప్రాంతాల్లో ఉండేవైతేనేం వాటి మొత్తం బరువు ఎంత ఉంటుందన్నదీ వారు అంచనా వేశారు. భూమ్మీద మొత్తం చీమల బరువు కోటీ ఇరవై లక్షల టన్నులు అని లెక్కవేశారు. భూమ్మీద పక్షులు, మనుషులు మినహా మిగతా అన్ని జీవుల కంటే చీమల బరువే ఎక్కువని పేర్కొన్నారు.
  • ఉష్ణ మండల ప్రాంతాల్లో అంటే భూమధ్యరేఖకు పది డిగ్రీల అక్షాంశాలపైన, కింద చీమలు అతి ఎక్కువగా ఉన్నాయని.. ధ్రువ ప్రాంతాల్లో చీమలు అసలే లేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే.. గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో చీమలు ఎక్కువని.. నగర ప్రాంతాల్లో తక్కువని చెప్పారు.
  • కేవలం చీమల కోసం ఇంత అధ్యయనం అవసరమా అన్న ప్రశ్నలు వస్తాయని ముందే భావించిన శాస్త్రవేత్తలు.. ఇందుకు సమాధానాన్ని కూడా ముందే చెప్పేశారు.
  • చీమలు నేలలో మట్టిని కదిలించి, గాలి చొరబడేలా చేస్తాయని.. అందువల్ల నైట్రోజన్‌ చేరి మొక్కలు, చెట్ల పెరుగుదలకు పనికొస్తుందని వివరించారు. చీమలు ఏటా ఒక్కో హెక్టారు నేల నుంచి సుమారు 13 టన్నుల మట్టిని కదిలిస్తాయని తెలిపారు.
  • ఈ వివరాలు ఇటీవలే నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌ జర్నల్‌ లో ప్రచురితం అయ్యాయి. ఉజ్జాయింపుగానైనా సరే భూమిపై చీమల సంఖ్య ఇలా తేల్చడం ఇదే మొదటిసారి కూడా.

Related posts

కరోనా ఎఫెక్ట్.. శ్రీశైలం లో ఆగిన మల్లన్న సర్వదర్శనం ….

Drukpadam

పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ…!

Drukpadam

కేరళలో బెంబేలెత్తిస్తున్న టమాటా ఫ్లూ.. లక్షణాలు ఇవే!

Drukpadam

Leave a Comment